హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని బీడి, సినీ, లైమ్‌స్టోన్, డోలమైట్, మైకా, ఐరన్ ఓర్, మాంగనీస్, క్రోమ్ ఓర్ కార్మికుల పిల్లల విద్యకు స్కాలర్షిప్ కోసం నవంబర్ 30 వరకు www.scholarships.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ అసిస్టెంట్ కమిషనర్ అభినవ్ తివారి తెలిపారు. 202324 విద్యాసంవత్సరానికి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రీ మెరిట్, 11వ తరగతి నుంచి డిగ్రీ వరకు పోస్ట్ మెరిట్ కింద దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సందేహాలకు helpdesk@ nsp.gov.in లేదా 040- 29561297ను సంప్రదించాలని పేర్కొన్నారు.