హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ) : కాళోజీ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయంలో బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సు ప్రవేశాలకు ఈ నెల 6 నుంచి www.fcrihyd.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఎప్సెట్ ర్యాంకు ఆధారంగా ప్రవేశాలుంటాయని తెలిపారు. ప్రవేశ దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు రూ.400, ఇతరులకు రూ.600గా నిర్ణయించారు. ఈ నెల 27 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు ఫీజు చెల్లించాలని, వివరాలకు 8074350866/9666460939 నంబర్లను సంప్రదించాలని సూచించారు.