సింపుల్ తెలుగులో 20 మార్కులకే పాస్.. తెలుగు ద్వితీయ భాష విద్యార్థులకు వర్తింపు
రాష్ట్రంలో తెలుగేతర మీడియాల్లో చేరి.. సింపుల్ తెలుగు సబ్జెక్టును తీసుకున్న విద్యార్థులు వార్షిక పరీక్షల్లో 20 మార్కులు సాధిస్తే సరిపోతుంది.
- ఇతర మీడియాల్లోని పదోతరగతివిద్యార్థులకు తెలుగు తప్పనిసరి
- వార్షిక పరీక్షల నిర్వహణపై అధికారుల కసరత్తు
హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో తెలుగేతర మీడియాల్లో చేరి.. సింపుల్ తెలుగు సబ్జెక్టును తీసుకున్న విద్యార్థులు వార్షిక పరీక్షల్లో 20 మార్కులు సాధిస్తే సరిపోతుంది. ఈ మార్కులు సాధిస్తే వారు పాస్ అయినట్టే లెక్క. ఈ ఏడాది ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ వంటి మాధ్యమాల్లో చదువుతూ తొలిసారిగా తెలుగును ద్వితీయ భాషగా తీసుకున్న పదో తరగతి విద్యార్థులు ఎస్సెస్సీ పరీక్షలు రాయనున్నారు. తెలుగు తప్పనిసరి అమలు చట్టం -2018తో అన్ని మీడియాల్లోని విద్యార్థులు తెలుగును సబ్జెక్టును తీసుకోవడం అనివార్యమైంది.
2023లో జరిగే ఎస్సెస్సీ వార్షిక పరీక్షల్లో వీరంతా తెలుగు సబ్జెక్టు పరీక్ష రాయనున్నారు. ఏ మీడియం వారికైనా తెలుగు, ఇంగ్లిష్ తప్పసరికాగా, వారి వారి మాతృభాషను సైతం ఒక సబ్జెక్టుగా తీసుకొనే అవకాశం ఉన్నది. ఈ ఏడాది సింపుల్ తెలుగు పేపర్‌కు వార్షిక పరీక్షను నిర్వహించే అంశం, పరీక్షను ఒకే రోజు నిర్వహించాలా.. లేక వేర్వేరు తేదీల్లో నిర్వహించాలా అన్న అంశంపై ఎస్సీఈఆర్టీ, ఎస్సెస్సీ బోర్డు అధికారు లు బుధవారం చర్చించారు. దీనిపై త్వరలోనే స్పష్టత వస్తుందని ఓ ఉన్నతాధికారి తెలిపారు.
మూడు రకాలుగా
- స్టాండర్డ్ తెలుగు (మొదటి భాష) విద్యార్థులకు 80 మార్కులకు వార్షిక పరీక్షలు, 20 మార్కులకు ఇంటర్నల్ పరీక్షలు నిర్వహిస్తారు. వీరికి 35 మార్కులొస్తే పాసైనట్టే.
- కాంపొజిట్ తెలుగు విద్యార్థులకు 80 మార్కుల థియరీ ఎగ్జామ్‌లో 60 మార్కులకు తెలుగు, 20 మార్కులకు సంస్కృతం లో పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇంటర్నల్స్‌గా 20 మార్కులుంటాయి. వీరు 35 మార్కులు పొందితే పాస్ అయినట్టు.
- సింపుల్ తెలుగు (రెండోభాషగా తెలుగు) తీసుకున్న విద్యార్థులకు 80 మార్కులు థియరీ, 20 మార్కులు ఇంటర్నల్స్‌గా ఉంటాయి. అయితే వీరు 20 మార్కులు సాధిస్తే సరిపోతుంది.
ఇతర బోర్డుల్లో సైతం..
ఈ విద్యాసంవత్సరంలో సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ వంటి బోర్డుల విద్యార్థులకు పదో తరగతి వార్షిక పరీక్షల్లో తెలుగు తప్పనిసరిగా ఉండనున్నది. వీరికి ఆయా బోర్డులే పరీక్షలు నిర్వహిస్తాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

