హైదరాబాద్, జూలై 23(నమస్తే తెలంగాణ): కేసీ (కర్నూల్-కడప) కెనాల్ ద్వారా వాస్తవ కేటాయింపుల కంటే ఏపీ సగటున 54 టీఎంసీలను అధికంగా వాడుతు న్నదని తెలంగాణ వెల్లడించింది. బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వద్ద టెలీమెట్రీల ఏర్పాటుకు ఏపీ అభ్యంతరం చెప్తున్నదని బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌కు నివేదించింది. కేంద్ర ప్రభు త్వం జారీచేసిన సెక్షన్ 3 మార్గదర్శకాల మేరకు ఇరు రాష్ర్టా ల మధ్య కృష్ణాజలాల పునఃపంపిణీకి సంబంధించి బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ చేపట్టిన విచారణ బుధవారం ఢిల్లీలో పునఃప్రారంభమైంది. ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ బ్రిజేశ్ కుమార్, సభ్యులు జస్టిస్ రామ్మోహన్‌రెడ్డి, జస్టిస్ ఎస్ తలపాత్ర ఎదుట తెలంగాణ తుది వాదనలను కొనసాగిం చింది. ప్రధానంగా ఏపీలోని కేసీ కెనాల్‌పై వాదనలు విని పించింది. పూర్వపు హైదరాబాద్ స్టేట్ సమ్మతితో 1860 లో కేసీ కెనాల్‌ను అభివృద్ధి చేశారని, పూర్వపు హైదరాబాద్ స్టేట్, మద్రాస్ స్టేట్ మధ్య 1944 జూన్‌లో జరిగిన ఒప్పందం ప్రకారం.. నాటి మద్రాస్ (ప్రస్తుతం ఏపీ)లోని కేసీ కెనాల్లో నీటివినియోగం 10టీఎంసీలని, హైదరాబా ద్‌లోని ఆర్డీఎస్లో నీటి వినియోగం 17.9టీఎంసీలని వివరించింది.
1951లో జరిగిన ఇంటర్ స్టేట్ కాన్ఫరెన్స్‌లో సెంట్రల్ వాటర్ అండ్ పవర్ కమిషన్ ఇదే విషయాన్ని వెల్లడించిందని తెలిపింది. ఆ ఒప్పందాన్ని పట్టించుకోకుం డా ఏపీ ప్రభుత్వం కేసీ కెనాల్ వినియోగాన్ని 39.9 టీఎం సీలకు పెంచడంతోపాటు ట్రిబ్యునల్-1 నుంచి ఆ మేరకు వాటా పొందిందని పేర్కొన్నది. ఆ కేటాయింపుల కన్నా వాస్తవ వినియోగం సగటున 54 టీఎంసీలు ఎకువగా ఉన్నదని తెలంగాణ తెలిపింది. ఇంకా నిప్పులవాగు, గాలే రు, కుందూ (పెన్నా ఉపనదులు) తదితర వాగుల ద్వారా కూడా 5.2టీఎంసీలను అందిస్తున్నదని, సుంకేశుల బరాజ్ ద్వారానే కాకుండా అదనంగా శ్రీశైలం నుంచి కేసీ కెనాల్‌కు నీటిని విడుదల చేసేందుకు ముచ్చుమర్రి, మల్యాల, బన కచర్ల వద్ద ఎసేప్ చానల్‌ను ఏర్పాటు చేసి కృష్ణా జలాలను మళ్లిస్తున్న దని ట్రిబ్యునల్‌కు నివేదించింది. ఇది ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధమని తెలంగాణ స్పష్టం చేసిం ది. ఎసేప్ చానల్ నుంచి ఎంత పరిమాణంలో నీటిని మళ్లిస్తున్నారని బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ప్రశ్నించడంతో.. కేసీ కెనాల్‌కు మొత్తంగా 45.1టీఎంసీల నీటి లభ్యత ఉన్న ప్పటికీ శాస్త్రీయ అంచనా ప్రకారం అక్కడ నీటి అవసరం 18.51 టీఎంసీలే నని తెలం గాణ తెలిపింది. తద్వారా 26.59 టీఎంసీలు ఆదా అవుతా యని, ఆ జలాలను బేసిన్ పరిధిలోని తెలంగాణ ప్రాజెక్టులకు కేటాయించాలని ట్రిబ్యునల్‌కు విజ్ఞప్తి చేసింది.