China Manja | హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): సంక్రాంతి వేడుకల్లో పతంగులతోపాటు పక్షులనూ ఎగరనిద్దామని అటవీ దళాల ప్రధాన సంరక్షణ ఆధికారి ఆర్ఎం డోబ్రియాల్ పిలుపునిచ్చారు. పతంగులు ఎగురవేసేందుకు కాటన్ దారాలను మాత్రమే వాడాలని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని అటవీశాఖ ప్రధాన కార్యాలయం అరణ్యభవన్‌లో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘చైనా మాంజాపై ప్రజలకు అవగాహన కల్పించి పక్షులని రక్షిద్ధాం’ అనే వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. చైనా మాంజా అమ్మినా, నిలువ చేసినా, రవాణా చేసినా ఐదేండ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల వరకు జరిమానా ఎదురోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. చైనా దారం అమ్మకం వివరాలు తెలిస్తే 040-23231440, 18004255364నంబర్లకు ఫోన్ చేసి తెలపాలని సూచించారు.