ఘట్కేసర్, జనవరి 27: తమపై వస్తున్న భూకబ్జా ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని అనురాగ్ యూనివర్సిటీ సీఈవో నీలిమ పేర్కొన్నారు. భూకబ్జా ఆరోపణలను ఆమె ఖండించారు. శనివారం యూనివర్సిటీలో జరిగిన అనురాగ్ సెట్ నిర్వహణ కార్యక్రమంలో భాగంగా ఆమె మీడియాతో మాట్లాడారు.
పోలీస్టేషన్లో కేసు నమోదైన విషయం కూడా తమ దృష్టికి రాలేదని పేర్కొన్నారు. ఎలాంటి విచారణ చేయకుండా పోలీసులు కేసు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు. ఒకరి ప్లాటు ఆక్రమించాల్సిన అవసరం తమకు లేదని స్పష్టంచేశారు. బాధితులు ఎవరో కూడా తమకు తెలియదని చెప్పారు. రాజకీయ కోణంలోనే తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.