మహేశ్వరం, సెప్టెంబర్ 23: రంగారెడ్డి జిల్లా కందుకూరులోని మంఖాల్ లావణి పట్టా భూముల వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. రైతుల పేర్ల మీద కా కుండా అదనంగా ఉన్న భూములను తమ పేరు మీదికి మార్చుకున్నందున ఆ విస్తీర్ణానికి కూడా డబ్బులు చెల్లించాలని లావణి పట్టా ఉన్న రైతులు డిమాండ్ మొదలుపెట్టారు. మంఖాల్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 608, 609, 610ల్లోని 35.36 ఎకరాలను ఇందిరాగాంధీ కాలంలోనే దళిత రైతులకు ఉపాధి కోసం ఇవ్వ గా, ఈ భూములను ఒక కార్పొరేట్ కంపెనీతో పాటు కొందరు వ్యక్తులు చెరపట్టారు. ఈ బండారంపై ‘నమస్తే తెలంగాణ’లో ఆదివారం ‘ఇందిరమ్మ భూములకు కార్పొరేట్ చెర’ అనే శీర్షికన కథనం ప్రచురితమై ంది. ఇందులో రైతుల పేరిట రికార్డుల్లో లావణి పట్టాగా ఉన్న 35.36 ఎకరాలే కా కుండా అదనంగా 12 ఎకరాలు, మొత్తం 47.37 ఎకరాల భూమిని వీఆర్కే డెవలపర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్తో పాటు పలువురి పేర్లపై బదలాయించుకున్నారు.
ఓ వైపు దీనిపై విచారణ కొనసాగుతున్నదని కలెక్టర్ శశాంక చెప్తున్నా, క్షేత్రస్థాయిలో సదరు కంపెనీ వాళ్లు భూమిని స్వాధీనం చేసుకొని చుట్టూ రేకులతో ప్రహరీ కూడా నిర్మించారు. రికార్డుల మార్పిడి జరిగినందున రైతులందరికీ డబ్బులు చెల్లింపులయ్యాయ ని అనుకున్నారు. కానీ ‘నమస్తే తెలంగాణ’ కథనం తర్వాత అసలు గుట్టు బయటపడింది. సదరు కంపెనీ, వ్యక్తులు.. రైతులకు కేవలం వారి పేరిట లావణి పట్టా ఉన్న 33.36 (రెండెకరాలు డంపింగ్ యార్డుకు కేటాయింపు) ఎకరాలకు మాత్రమే చెల్లింపులు చేసినట్టు వెల్లడైంది. దీంతో సదరు కంపెనీతో లావాదేవీ జరిపిన మధ్యవర్తి వద్దకు వెళ్లిన రైతులు తమకు రికార్డుల్లో ఉన్న మేర విస్తీర్ణానికే డబ్బులు వచ్చాయ ని, అదనంగా 12 ఎకరాలు కూడా వారి పేర్ల మీద ఎక్కినందున డబ్బులు ఇప్పించాలంటూ ఒత్తిడి తెచ్చినట్టు తెలిసింది.
ఆ.. రెండెకరాలూ కానిచ్చేస్తున్నారు?
మూడు సర్వే నంబర్లలో 608/5లో ఉన్న రెండెకరాల లావణి పట్టా భూమిని రైతు అమ్ముకునేందుకు యత్నించగా, రెవె న్యూ అధికారులు పీవోటీ కింద ఆ భూమి ని స్వాధీనం చేసుకున్నారు. గ్రామ అవసరాల నిమిత్తం చెత్త డంపింగ్ యార్డుకు కేటాయించారు. రికార్డులో సర్కారు భూ మిగానే ఉన్నది. తాజాగా అంతా పోయా క.. ఈ రెండెకరాలు ఉండి ఏం లాభం అనుకున్నారో ఏమో! సోమవారం కొంద రు వ్యక్తులు ఆ భూమి చుట్టూ ప్రహరీ నిర్మించేందుకు పనులు మొదలుపెట్టారు. విషయం బయటికి పొక్కి అధికారుల దాకా వెళ్లింది. గంటల తరబడి తర్జనభర్జనలు పడిన అధికారులు ఎట్టకేలకు పను లు నిలిపివేయించినట్టు తెలిసింది. దీనిపై కొందరు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనా సోమవారం వరకు మాత్రం ఫిర్యాదు ఇవ్వలేదు.