హైదరాబాద్ : రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉత్తర తెలంగాణ పరిసరాల్లో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం తూర్పు మధ్య బంగాళాఖాతం, ఉత్తర తెలంగాణపై సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉందని చెప్పింది. వీటి ప్రభావంతో రాబోయే రెండు రోజులు వర్షాలు అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని.. రేపు, ఎల్లుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని, పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ పేర్కొన్నది. ఇదిలా ఉండగా.. ఇవాళ ఉదయం వరకు జగిత్యాల, కరీంనగర్, నిజామాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాపాతం నమోదైంది.