Telangana | హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మరో సర్వే మొదలుకానున్నది. ప్రజలకు సొంత ఇండ్లు, అద్దె ఇండ్లు ఎన్ని ఉన్నాయో లెక్కలు తీసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సర్వే బాధ్యతలను రాష్ట్రంలోని 142 మున్సిపాలిటీల పరిధిలో పనిచేస్తున్న సిబ్బందికి అప్పగించనున్నది. ఇప్పటికే కులగణన సర్వే చేయించి పీకల్లోతు పనిభారం పెంచారని మున్సిపల్ సిబ్బంది నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన సందర్భంగా తొమ్మిది రోజుల విజయోత్సవాల పేరిట రోజూ వారి పనులకు గండికొట్టారని, ఇది చాలదన్నట్టుగా మరో కొత్త రకమైన సర్వే తెరపైకి తెచ్చారని ఆగ్రహం వ్యక్తమవుతున్నది. మరోవైపు ప్రభుత్వం సర్వేల మీద సర్వేలు నిర్వహిస్తే.. ఇక ప్రజల సమస్యలను ఎప్పుడు పరిష్కరిస్తుందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 5 లక్షల మంది పేదలకు ఇండ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. అందులో భాగంగానే సర్వే చేపట్టనున్నట్టు అధికారులు తెలిపారు.
ఎల్ఆర్ఎస్పై సర్వేల ప్రభావం..
రాష్ట్రంలో భూముల రెగ్యులరైజేషన్కు సంబంధించి ఎల్ఆర్ఎస్ ఫీజు వసూళ్లపై వరుస సర్వేల ప్రభావం పడింది. దీంతో అధికారులు, సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతున్నది. ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారంతా ఫీజు చెల్లించడానికి ముందుకు రా వడం లేదు. ఈ క్రమంలో 142 మున్సిపాలిటీలకు చెందిన సిబ్బంది కూడాబిజీగా ఉం డటం ఈ ఆలస్యానికి కారణమని తెలుస్తుం ది. అయితే, రెగ్యులర్ పనులకు ఆటంకం క లిగించే సర్వేల నుంచి తమకు మినహాయిం పు ఇవ్వాలని మున్సిపాలిటీ సిబ్బంది ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మున్సిపాలిటీ కమిషనర్లు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తున్నారు. సర్వేపై ఆదేశాలు వచ్చిన త ర్వాత తమ స్పందిస్తామని మున్సిపల్ ఉద్యోగ సంఘం నాయకులు అభిప్రాయపడ్డారు.