డీహెచ్‌లో మరో అవినీతి బాగోతం
అవినీతికి నిలయంగా మారిన రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో తాజాగా మరో అధికారి అవినీతి బాగోతం వెలుగు చూసింది. డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ (డీహెచ్) పరిధిలోని నర్సింగ్ సెక్షన్లో సీనియర్ అసిస్టెంట్‌పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ అధికారి ప్రతి ఫైలుకు లంచం డిమాండ్ చేయడంతోపాటు వివిధ పనుల నిమిత్తం హెడ్ ఆఫీసుకు వచ్చే నర్సింగ్ ఆఫీసర్లను వేధిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం జిల్లా స్థాయిలో పనిచేస్తున్న కొంద రు మెడికల్ ఉద్యోగులు డీహెచ్ హెడ్ ఆఫీస్ లో పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
- నర్సింగ్ సెక్షన్లో సీనియర్ అసిస్టెంట్ వసూళ్ల దందా
- ఒక్కో డిప్యుటేషన్‌కు రూ.3 లక్షల చొప్పున వసూళ్లు
- క్యాన్సర్ పేషెంట్‌నూ వదలని వైనం
- హెల్త్ సెక్రటరీకి బాధితుల ఫిర్యాదు
హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): అవినీతికి నిలయంగా మారిన రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో తాజాగా మరో అధికారి అవినీతి బాగోతం వెలుగు చూసింది. డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ (డీహెచ్) పరిధిలోని నర్సింగ్ సెక్షన్లో సీనియర్ అసిస్టెంట్‌పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ అధికారి ప్రతి ఫైలుకు లంచం డిమాండ్ చేయడంతోపాటు వివిధ పనుల నిమిత్తం హెడ్ ఆఫీసుకు వచ్చే నర్సింగ్ ఆఫీసర్లను వేధిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం జిల్లా స్థాయిలో పనిచేస్తున్న కొంద రు మెడికల్ ఉద్యోగులు డీహెచ్ హెడ్ ఆఫీస్ లో పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
వారికి డిప్యుటేషన్లు ఇచ్చేందుకు సదరు అధికారి ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.3 లక్షల వర కు వసూలు చేసినట్టు సమాచారం. రెండేండ్లుగా అదే సెక్షన్లో పాతుకుపోయిన ఆ అధికారి అన్ని క్యాడర్ల ప్రమోషన్లకు సైతం ఓ రేటును ఫిక్స్చేసి నర్సింగ్ ఆఫీసర్ల వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలున్నా యి. ప్రస్తుతం తాను కొనసాగుతున్న పోస్టుకు రూ.3 లక్షలు చెల్లించి వచ్చానని, కనుక తాను అడిగినంత చెల్లించాల్సిందేనని ఆ అధికారి హుకుం జారీ చేసినట్టు తెలుస్తున్నది.
క్యాన్సర్ పేషెంట్‌ను సైతం వదలకుండా..
మహబూబాబాద్‌కు చెందిన ఓ నర్సింగ్ ఆఫీసర్ క్యాన్సర్‌తో బాధ పడుతూ తన పే-స్కేల్ రీవ్యాలిడేషన్ కోసం సదరు అధికారిని సంప్రదించడంతో రూ.5 వేలు వసూలు చేసినట్టు తెలిసింది. అయినప్పటికీ ఆ పని చేయకుండా పెండింగ్‌లో పెట్టినట్టు సమాచారం. కొత్తగూడెంకు చెందిన ఇద్దరు నర్సింగ్ ఆఫీసర్లు నిరుడు జూలై 31న ఫారెన్ సర్వీస్ డిప్యుటేషన్‌కు దరఖాస్తు చేసుకున్నారు.
వారి ఫైల్‌ను పక్కన పెట్టిన సదరు అధికారి.. ఆ త ర్వాత ఐప్లె చేసుకున్న మరో నలుగురు నర్సిం గ్ ఆఫీసర్ల నుంచి డబ్బులు వసూలు చేసి ఫారెన్ సర్వీస్ డిప్యుటేషన్ ఇచ్చినట్టు తెలిసింది. తనకు డీహెచ్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, తనను ఎవరూ ఏమీ చేయలేరని చెప్పుకుంటున్నట్టు ఆరోపణలున్నాయి. ఇటీవల కొందరు బాధితులు ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

