Maoists Surrender | డీజీపీ ఎదుట మరో 42 మంది మావోయిస్టులు లొంగుబాటు
Maoists Surrender | తెలంగాణ పోలీసుల ఎదుట మావోయిస్టులకు చెందిన కీలక నాయకులతో సహ మొత్తం 42 మంది మావోయిస్టులు లొంగిపోయారు.
హైదరాబాద్ : తెలంగాణ పోలీసుల ఎదుట మావోయిస్టులకు చెందిన కీలక నాయకులతో సహ మొత్తం 42 మంది మావోయిస్టులు ( Maoists Surrender) లొంగిపోయారు. తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి ( DGP Shivadar Reddy ) సమక్షంలో 36 ఆయుధాలు, 800 గ్రాముల బంగారంతో లొంగిపోయారని పోలీసులు ప్రకటించారు. వీరంతా చత్తీస్ఘడ్ రాష్ట్రానికి చెందిన వారని వెల్లడించారు.

పీఎల్జీఏ బెటాలియన్ కమాండర్, డీకేఎస్జెడ్సీ సభ్యుడు సోడి మల్ల ఎలియాస్ కేషాల్, జేఎంఎండబ్ల్యూసీ డివిజనల్ కమిటీ కార్యదర్శి చాప నారాయణ అలియాస్ గజేందర్, బీకే ఎఎస్ఆర్ డివిజనల్ కమిటీ సభ్యుడు కడ్తి సన్నుతో లొంగిపోయారు. ఐదు ఏకే-47 రైఫిళ్లు, నాలుగు ఎస్ఎల్ఆర్ రైఫిళ్లు, మూడు ఇన్సాస్ రైఫిళ్లు, ఆరు 303 రైఫిళ్లు, ఒక 9ఎంఎం స్టెన్ గన్, రెండు 8 ఎంఎం రైఫిళ్లు, పది సింగిల్ షాట్ గన్స్, ఒక 9 ఎంఎం పిస్టల్, రెండు రివాల్వర్లు, 1007 తూటాలు, 800 గ్రాముల బంగారాన్ని పోలీసులకు అప్పగించారు.

42 మంది జనజీవన స్రవంతిలో కలవడం ద్వారా సీపీఐ మావోయిస్టు లోని మూడు మ్యాజిక్ వెపన్స్‌లో అత్యంత కీలకమైన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్టీ పూర్తిగా కనుమరుగు అయిందని తెలిపారు.లొంగిన మావోయిస్టులకు కోటీ 93 లక్షల రివార్డును త్వరలో అందజేస్తామని వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- dgp
- Hyderabad
- Key leaders
- Maoists
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

