హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ) : రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పుష్పక్ టికెట్‌తో జంటనగరాల్లోని వివిధ ప్రాంతాలకు ప్రయాణించే వారికి టీఎస్ఆర్టీసీ ఆఫర్ ప్రకటించింది.
ఈ పుష్పక్ టికెట్ ద్వారా సిటీ బస్సుల్లో మరో 3 గంటల పాటు ఉచితంగా ప్రయాణించవచ్చని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ గురువారం ట్విట్టర్ ద్వారా తెలిపారు.