హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది వానకాలం సాగు ప్రణాళికను వెంటనే ప్రకటించాలని తెలంగాణ రైతు సంఘం సీనియర్ నాయకులు కారంపల్లి మల్లారెడ్డి, కేంద్ర కమిటీ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగర్ డిమాం డ్ చేశారు. బుధవారం తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్రావు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు.
మే 24తో రోహిణి కార్తె ప్రవేశిస్తున్నదని, వర్షాలు పడితే రైతులు మెట్ట పంటలు వేస్తారని పేర్కొన్నారు. కానీ ప్రభుత్వం 2021 నుంచి వ్యవసాయ ప్రణాళిక ప్రకటించడం నిలిపివేసిందని తెలిపారు. ధాన్యం వారాలతరబడి కొనడంలేదని, గోనె సం చులు, లారీలు, గోదాముల అందుబా టు లేవని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగర్ విమర్శించారు. వానాకాలం పంటలు వేసేనాటికి రైతు భరో సా జమ చేయాలని మల్లారెడ్డి, జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు.