కమాన్‌చౌరస్తా, జూలై 21 : కరీంనగర్‌కు చెందిన తెలంగాణ కవి అన్నవరం దేవేందర్‌కు దాశరథి శతజయంతోత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం దాశరథి కృష్ణమాచార్య సాహిత్య పురస్కారం వరించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ మండలం పోతారం(ఎస్)లో కేదారమ్మ-దశరథం దంపతులకు 1962 అక్టోబర్ 17న ఆయన జన్మించారు. ఎంఏ సామాజిక శాస్త్రం పూర్తి చేసిన ఆయన, జిల్లా పరిషత్‌లో సూపరింటెండెంట్‌గా 2020లో ఉద్యోగ విరమణ పొందారు. తెలంగాణ మాండలికంలో కవిత్వాలు రాస్తూ, నేటి తరానికి స్ఫూర్తిదాయకంగా రచనలు చేస్తూ, తన కలం నుంచి ధికార స్వరాన్ని వినిపించిన గొప్ప వ్యక్తిగా గుర్తింపు పొందారు.
ఇప్పటివరకు 16 పుస్తకాలు వెలువరించి ప్రశంసలు అందుకున్నారు. మొదటిసారి 2001లో ‘తొవ్వ ’తో తన మొదటి కవిత సంపుటి వెలువరించారు. 2005లో మంకమ్మతోట లేబర్ అడ్డా పుస్తకం ఆవిష్కరించగా, ఆ పుస్తకాన్ని డిగ్రీ పాఠ్యాంశంగా చేర్చారు. ప్రస్తుతం ఆయన కరీంనగర్లో కాలమిస్టుగా పలు పత్రికల్లో వ్యాసాలు రాస్తున్నారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో మంగళవారం సాయంత్రం నిర్వహించే కార్యక్రమంలో ఆయన ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.
శ్రీశ్రీ, శివసాగర్, సినారె, ఎన్ గోపి, నందిని సిదారెడ్డి సాహిత్య పుస్తకాలు చదివే క్రమంలో ఆయనకు 1988లో సాహిత్యంపై మకువ ఏర్పడింది. అన్నవరం ఇప్పటివరకు 16 పుస్తకాలు వెలువరించారు. ఇందులో 12 కవిత్వాలు, 2 ఆంగ్ల అనువాద కవిత్వం, 2 వ్యాసాల సంపుటిలు ఉన్నాయి. 2001లో ‘తొవ్వ ’తో తన మొదటి కవిత సంపుటి వెలువరించారు. ఆ తరువాత 2003లో ‘నడక’ తన ద్వితీయ పుస్తకాలు అచ్చువేశారు. 2005లో మంకమ్మతోట లేబర్ అడ్డా పుస్తకం ఆవిషరించారు. ఆ పుస్తకాన్ని డిగ్రీ పాఠ్యాంశంగా చేర్చారు. ‘బుడ్డ పరలు’ నానీలు 2006లో, బొడ్డు మల్లె చెట్టు 2008లో, పొద్దుపొడుపు కవిత సంకలాన్ని 2011లో ఆవిషరించారు.
2014లో పొకిలి వాకిళ్లు పులకరింత, 2016లో ‘బువ్వ కుండ’ దీర్ఘ కవిత సంపుటి, 2016లో ఇంటి దీపం, 2018లో వరిగొలుసులు, 2021లో గవాయి, 2022లో జీవన తాత్పర్యం పుస్తకాలను ఆవిషరించారు. 2002లో ‘మరో కోణం’ వ్యాస సంపుటిని, ‘ఊరి దస్తూరి’ వ్యాస సంపుటి, 2023లో సంచార యాత్ర వ్యాసాల సంకలనం, 2024లో అంతరంగం (వర్తమాన జీవిత చిత్రణ)ను అన్నవరం దేవేందర్ సంపాదకులుగా వ్యవహరించారు.