BRS party | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, బీఆర్ఎస్ నాయకులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అత్యంత వివాదాస్పద, అన్-పార్లమెంటరీ వ్యాఖ్యలను మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తీవ్రంగా ఖండించారు. సీఎం వ్యాఖ్యలను నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు.
బీఆర్ఎస్ నాయకుల రక్తాన్ని పంటల మీద చల్లితే అదే పండుతుంది అంటూ హింసను ప్రేరేపించేలా, రాజకీయ ప్రత్యర్థులను ఉద్దేశించి సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డిపై భారతీయ న్యాయ సంహిత (BNS), 2023 కింద తక్షణమే FIR నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేశాయి.



Anil Menon | ఈ రాత్రే అంతరిక్ష యాత్రకు అనిల్ మీనన్.. వచ్చే ఏడాది ఏప్రిల్లో తిరిగి భూమికి
Watch: కదులుతున్న రైలులో పూజా కార్యక్రమం.. వైరల్ వీడియోపై రైల్వే వివరణ
Raaka | ‘రాకా’లో మరో హీరోయిన్ ఫిక్స్.. అల్లు అర్జున్ సినిమాపై అంచనాలు పెంచిన నైలా గ్రేవల్ !