MLA Anirudh Reddy | ‘అరబిందో ఫార్మా’ను తగులబెడ్త! జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి అల్టిమేటం
MLA Anirudh Reddy | ‘పలుమార్లు స్వయంగా హెచ్చరించినా.. రాష్ట్ర అసెంబ్లీలో ఫిర్యాదు చేసినా.. అరబిందో ఫార్మా కంపెనీ ముదిరెడ్డిపల్లి చెరువులోకి కలుషిత జలాలను వదులుతూనే ఉన్నది. ఈ వ్యవహారంలో కాలుష్య నియంత్రణ మండలికి ఒక్కరోజు టైం ఇస్తున్నా.. చర్యలు తీసుకోకుంటే ఆదివారమే అరబిందో ఫార్మా కంపెనీ వద్దకు వెళ్లి తగులబెడ్త’ అని మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి హెచ్చరించారు.
- కలుషిత జలాల విడుదలపై చర్యలేవి?
- అసెంబ్లీలో ఫిర్యాదు చేసినా పట్టింపేది?
- శనివారం ఒక్కరోజే గడువు ఇస్తున్న..
- ఆదివారం 11 గంటలకు చర్య తప్పదు
- ఫార్మా కంపెనీకి, పొల్యూషన్ బోర్డుకు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి అల్టిమేటం
MLA Anirudh Reddy | జడ్చర్ల, సెప్టెంబర్ 26 : ‘పలుమార్లు స్వయంగా హెచ్చరించినా.. రాష్ట్ర అసెంబ్లీలో ఫిర్యాదు చేసినా.. అరబిందో ఫార్మా కంపెనీ ముదిరెడ్డిపల్లి చెరువులోకి కలుషిత జలాలను వదులుతూనే ఉన్నది. ఈ వ్యవహారంలో కాలుష్య నియంత్రణ మండలికి ఒక్కరోజు టైం ఇస్తున్నా.. చర్యలు తీసుకోకుంటే ఆదివారమే అరబిందో ఫార్మా కంపెనీ వద్దకు వెళ్లి తగులబెడ్త’ అని మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు తన ప్రెస్నోట్తోపాటు వీడియో, ఫొటోలను శుక్రవారం మీడియాకు విడుదల చేశారు. జడ్చర్ల మండలం పోలేపల్లి సెజ్‌లోని అరబిందో ఫార్మా కంపెనీ సమీపంలోని ముదిరెడ్డిపల్లి చెరువులోకి కలుషిత జలాలను వదులుతున్నదని, దీంతో ఆ చెరువులోని చేపలు చనిపోతున్నాయని, దాని పరిధిలోని పంటలు పండటం లేదని తెలిపారు. ఈ విషయాలను గతంలోనే తాను అసెంబ్లీలో ప్రస్తావించినా కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు పట్టించుకోవడం లేదని చెప్పారు.
ఈ విషయంలో అధికారులకు, అరబిందో ఫార్మా కంపెనీకి మధ్య ఏ లాలూచీ ఉన్నదో తనకు తెలియదని తెలిపారు. మరోసారి కలుషిత జలాలను చెరువులోకి వదిలితే సహించేది లేదని హెచ్చరించారు. గతంలోనూ కలుషిత జలాలు వదిలితే కంపెనీని తగులబెడతానని హెచ్చరించిన విషయాన్ని గుర్తుచేశారు. అయినా తన హెచ్చరికలను పెడచెవిన పెట్టి కంపెనీ యథావిధిగా చెరువులోకి వ్యర్థాలను వదులుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కంట్రోల్ బోర్డుకు శనివారం ఒక్కరోజు గడువు ఇస్తున్నానని, తక్షణమే చర్యలు తీసుకొని కలుషిత జలాలను చెరువులోకి వదలకుండా చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆదివారం ఉదయం 11 గంటలకు తాను అరబిందో ఫార్మా కంపెనీ వద్దకు వెళ్లి దాన్ని తగులబెడతానని హెచ్చరించారు. జడ్చర్ల నియోజకవర్గ రైతులు నష్టపోతుంటే చూస్తూ ఊరుకునే ఓపిక తనకు లేదని తెలిపారు. చర్యలు తీసుకుంటారో, లేక కంపెనీ తగులబెట్టక తప్పని పరిస్థితి తీసుకొస్తారో మీ ఇష్టమని తేల్చి చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Salman Khan | యూట్యూబ్‌లో అడుగుపెట్టిన సల్మాన్ ఖాన్.. కోచ్‌గా, స్టూడెంట్‌గా భాయ్ సందడి!
Jailer 2 | రజనీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్ ..తెలంగాణలో సాధారణ టికెట్ ధరలకే ‘జైలర్ 2’..
Mamitha Baiju | ‘జై హనుమాన్’లో మమితా బైజు.. రిషబ్ శెట్టి, రానా సరసన కీలక పాత్రలో కనిపించనుందా?
Donald Trump: రష్యా నుంచి డీజిల్ కొంటామన్న ట్రంప్.. పుతిన్‌కు గిఫ్ట్ ఇచ్చారన్న జెలెన్స్కీ
Ramayana | కైకేయిగా లారా దత్తా, మంథరగా షీబా.. ‘రామాయణం’ నుంచి ఫస్ట్ లుక్స్ విడుదల
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

