మానవ అక్రమ రవాణా నిర్మూలనలో సోషల్ పోలీస్‌గా అంగన్వాడీలు

హైదరాబాద్ : మానవ అక్రమ రవాణాను అరికట్టడంపై కూడా అంగన్వాడీలు సోషల్ పోలీస్‌గా పనిచేయాలని, మహిళలకు, పిల్లలకు రక్షణ కవచంలాగా మారాలని రాష్ట్ర స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శుక్రవారం ప్రపంచ మానవ అక్రమ రవాణ వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టరేట్ లో మానవ అక్రమ రవాణ నిర్మూలన కోసం రూపొందించిన పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. మానవ అక్రమ రవాణా నిర్మూలనకు పనిచేసిన అధికారులు, అంగన్వాడీ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు ఇచ్చి సత్కరించారు. లైంగిక దాడికి గురై స్వచ్ఛంద సంస్థల సహకారంతో తిరిగి జీవితాన్ని ప్రారంభించి, అక్రమ రవాణా నిర్మూలనకు పనిచేస్తున్న మహిళలను మంత్రి సత్కరించారు.
ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. మానవ అక్రమ రవాణకు పాల్పడుతున్న వారిలో పురుషులే కాకుండా మహిళలు కూడా ఉండడం దురదృష్టకరం అన్నారు. బాధితులుగా మారిన వారిని చేయని నేరానికి తల్లిదండ్రులు కూడా శిక్షిస్తున్న ఈ సమాజంలో ప్రజ్వల వంటి సంస్థలు వారిని చేరదీసి, ఆశ్రయం ఇచ్చి, తిరిగి గౌరవ ప్రదమైన జీవనం కల్పించడం నిజంగా చాలా గొప్ప విషయమని కొనియాడారు. ఈ అక్రమ రవాణాలో ప్రధానంగా దోషులను పట్టుకునేది, బాధితులను రక్షించేది పోలీసులు అన్నారు. ఈ మానవ అక్రమ రవాణాను ఆపటం ఏ ఒక్కరితో సాధ్యం అయ్యేది కాదు. సమాజం పాత్ర చాలా ముఖ్యమైందన్నారు.
కుటుంబంలో అమ్మాయిల పట్ల ఉన్న వివక్ష పోవాలి. కుటుంబాలకు అవగాహన కల్పించాలి. సమాజంలో చైతన్యం కల్పించడం ద్వారా ఈ అక్రమ రవాణాను నిర్మూలించాలన్నారు. దేశంలో మానవ అక్రమ రవాణాను అరికట్టడంలో, వారికి పునరావాసం కల్పించడంలో తెలంగాణ రాష్ట్రం బాగా పని చేస్తుందని ప్రజ్వల సంస్థ వ్యవస్థాపక నిర్వాహకురాలు సునీతా కృష్ణన్ చెప్పడం చాలా సంతోషం అని ఇది తమపై మరింత బాధ్యత పెంచిందని మంత్రి పేర్కొన్నారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

