CM Revanth Reddy | రేవంత్ హామీ ఉత్తిమాటేనా?.. అంగన్వాడీలంటే అంత అలుసా!
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమ సమస్యల ఊసే ఎత్తడం లేదని.. తమను ఉద్ధరిస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి మాట ఉత్తిదేనని తేటతెల్లమైందని అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీ జయలక్ష్మి ధ్వజమెత్తారు.
- సర్కారును గద్దె దించుతాం
- అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ ధర్నా
CM Revanth Reddy | జూబ్లీహిల్స్, జూన్ 7: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమ సమస్యల ఊసే ఎత్తడం లేదని.. తమను ఉద్ధరిస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి మాట ఉత్తిదేనని తేటతెల్లమైందని అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీ జయలక్ష్మి ధ్వజమెత్తారు. అంగన్వాడీలకు రిటైర్మెంట్ బెన్ఫిట్స్ వర్తింపచేయడంతోపాటు తీవ్రనష్టం కలిగించే రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ఉపసంహరించుకోవాలని, జీవో నం.10ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ యూసుఫ్‌గూడలోని తెలంగాణ మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యాలయం ఎదుట రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి తరలివచ్చిన అంగన్వాడీ సిబ్బందితో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జయలక్ష్మి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంత్రులు సత్యవతి రాథోడ్, హరీశ్‌రావు సమక్షంలో అందరికీ ఆమోదయోగ్యమైన రిటైర్మెంట్ బెనిఫిట్స్‌లో టీచర్లకు రూ.2 లక్షలు, హెల్పర్లకు రూ. లక్ష, 60 ఏండ్లు దాటినవారికి వీఆర్ఎస్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం మహిళా, శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ క్రాంతి వెస్లీతో చర్చలు జరిపిన తర్వాత వినతిపత్రం అందజేశారు.
రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచాలి
అంగన్వాడీ టీచర్లు, ఆయాలుగా పనిచేస్తున్న వేలాది మందికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచాలని కోరుతూ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్లా భారతి ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం శుక్రవారం సచివాలయంలో ఐసీడీఎస్ ముఖ్య కార్యదర్శి వాకాటి కరుణను కలిసి వినతిపత్రం అందజేసింది. అనారోగ్య కారణాలతో ఉద్యోగానికి రాజీనామా చేసినవారికీ బెనిఫిట్స్ కల్పించాలని కోరారు. రాష్ట్రంలో అన్ని అంగన్వాడీ కేంద్రాలను పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రాలుగా నడపాలని, ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని, జనాభా ప్రాతిపదికన అదనపు టీచర్లను నియమించాలని, పెండింగ్ ఎరియర్స్, బిల్లులు వెంటనే చెల్లించాలని వినతిపత్రంలో కోరారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర కోశాధికారి వేదవతి, ఉపాధ్యక్షురాలు అరుణ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

