హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): ఎండలు ముదురుతున్న నేపథ్యంలో శనివారం నుంచి అంగన్వాడీ కేంద్రాలను ఒంటి పూట నిర్వహించాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క అధికారులకు ఆదేశాలు జారీచేశారు. పాఠశాలల తరహాలోనే అంగన్వాడీ కేంద్రాలను ఒంటి పూటనే తెరువనున్నారు. ఉదయం 8 నుంచి 12:30 గంటల వరకు అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తాయి.