హైదరాబాద్ మే 25 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్ల సరఫరా టెండర్ల గడువు ఆదివారంతో ముగిసిందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
ఇప్పటికే మూడుసార్లు టెండర్ల గడువు పొడిగించిన ప్రభుత్వం టెండర్లను ఓపెన్ చేసి తక్కువకు కోట్ చేసిన వారికి కోడిగుడ్ల సరఫరా బాధ్యతలను అప్పగిస్తుందా?.. లేక మళ్లీ పొడిగిస్తుందా అనే విషయంపై రెండ్రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది.