హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): ఐసీడీఎస్ గ్రేడ్-2 సూపర్వైజర్ నియామకాల్లో అంగన్వాడీ సర్వీసుకు ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ను టీఆర్ఎస్కేవీ అనుబంధ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్ల భారతి నేతృత్వంలో ప్రతినిధి బృందం కోరింది. హైదరాబాద్‌లోని డీఎస్ఎస్ (సంక్షేమభవన్)లో మంగళవారం మంత్రిని నేతలు కలిశారు. 30 ఏండ్లకుపైగా సర్వీస్‌లో ఉన్నవాళ్లకు శాఖాపర పదోన్నతుల్లో ప్రాధాన్యం ఇవ్వాలని వినతిపత్రం సమర్పించారు. ఈ నెల 8 నుంచి 16 వరకు అంగన్వాడీ కేంద్రాలకు కూడా సెలవులు ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు. మంత్రిని కలిసినవారిలో వేదవతి, పుష్ప, శారద, వేముల నర్సింగం ఉన్నారు.