Andhajyothy | అబద్ధాలను అక్షరాలుగా పేర్చి విషపు రాతలతో చెలరేగిపోతున్న అంధజ్యోతి
తెలంగాణపై తన గుడ్డి వ్యతిరేకతను ఏనాడూ దాచుకోని ఆంధజ్యోతి పత్రిక.. అడపాదడపా రాష్ట్ర ప్రభుత్వంపై విషం చిమ్ముతూనే ఉన్నది. తాజాగా ఎయిర్‌పోర్టుల ఏర్పాటుపై చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై గాలిపోగేసి ఓ కథనాన్ని వండివార్చింది. మామునూరు ఎయిర్‌పోర్టుకు 253 ఎకరాలు అప్పగిస్తూ ఆగస్టు 10వ తేదీనే కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా అంధజ్యోతికి కనిపించనేలేదు. రాష్ట్ర ప్రభుత్వం జాగ ఇవ్వట్లేదంటూ అబద్ధపు కథనాన్ని ప్రచురించింది.
- విమానాశ్రయాల ఏర్పాటుపై అబద్ధపు రాతలు
- 6 ఎయిర్‌పోర్టుల నిర్మాణాలకు నాలుగేండ్ల క్రితమే ప్రణాళికలు
- 2019 నుంచి రాష్ట్రం విన్నపాలు
- సీఎం అడిగినా స్పందించని కేంద్రం
- మామునూరుకు 253 ఎకరాలు అప్పగిస్తూ ఆగస్టు 10న నిర్ణయం
- ఈ నిజాలన్నీ పక్కన పెట్టేసి అంధజ్యోతి కల్పిత కథనం
తెలంగాణపై తన గుడ్డి వ్యతిరేకతను ఏనాడూ దాచుకోని ఆంధజ్యోతి పత్రిక.. అడపాదడపా రాష్ట్ర ప్రభుత్వంపై విషం చిమ్ముతూనే ఉన్నది. తాజాగా ఎయిర్‌పోర్టుల ఏర్పాటుపై చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై గాలిపోగేసి ఓ కథనాన్ని వండివార్చింది. మామునూరు ఎయిర్‌పోర్టుకు 253 ఎకరాలు అప్పగిస్తూ ఆగస్టు 10వ తేదీనే కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా అంధజ్యోతికి కనిపించనేలేదు. రాష్ట్ర ప్రభుత్వం జాగ ఇవ్వట్లేదంటూ అబద్ధపు కథనాన్ని ప్రచురించింది.
హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): తెలంగాణ దినదినాభివృద్ధి చెందుతుండడాన్ని ‘అంధజ్యోతి’ జీర్ణించుకోలేకపోతున్నది. రాష్ర్టాభివృద్ధిని దేశం మొత్తం వేనోళ్ల కీర్తిస్తుండడం ఆ పత్రికకు నచ్చడం లేదు. అబద్ధాలను అక్షరాలుగా పేర్చి విషపు రాతలతో చెలరేగిపోతున్నది. రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే లక్ష్యంగా వార్తలు వండి వారుస్తున్నది. ప్రతి విషయాన్ని రాద్ధాంతం చేయడమే పనిగా పెట్టుకున్నది. తాజాగా మరో గాలి వార్తలను రాసేసి ప్రజలపైకి వదిలేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే మామునూరు విమానాశ్రయానికి సంబంధించి భూసేకరణను వేగవంతం చేయాలని నిర్ణయించింది. గతంలో పౌర విమానయాన సంస్థ.. రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ సంయుక్తంగా సర్వే నిర్వహించి డీపీఆర్‌లను కేంద్రానికి నివేదించిన అంశాలను కప్పిపుచ్చుతూ గాలి వార్తలను రాసేసింది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పలుమార్లు కేంద్రానికి లేఖలు రాసిన విషయాన్ని మాటమాత్రమైన ప్రస్తావించకుండా తన నైజాన్ని చాటుకుంది.
వాస్తవాలకు సమాధి
వాస్తవానికి ప్రభుత్వం తొలి నుంచీ ద్వితీయశ్రేణి నగరాల అభివృద్ధిపై దృష్టిసారించింది. అందులో భాగంగా ఐటీరంగంతోపాటు వివిధ పరిశ్రమలను ద్వితీయశ్రేణి నగరాలకు విస్తరిస్తున్నది. అందులో భాగంగా వరంగల్ జిల్లాలోని మామునూరు, పెద్దపల్లి జిల్లాలోని బసంత్‌నగర్, ఆదిలాబాద్‌లో 3 గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్ పోర్టులు నిర్మించాలని భావించింది. వీటితోపాటు నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్‌పల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ, మహబూబ్‌నగర్ జిల్లాలోని దేవరకద్రలో మరో 3 గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలు నిర్మించాలని కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేసింది. అప్పట్లో విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా హైదరాబాద్ వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ స్వయంగా కలిసి చర్చించారు.
విమానాశ్రయాల ఏర్పాటుకు త్వరగా అనుమతులు ఇవ్వాలని విన్నవించారు. ఇది జరిగి నాలుగేండ్లు గడుస్తున్నా నేటికీ కేంద్రం నుంచి ఎటువంటి స్పందన లేదు. ఆదిలాబాద్, వరంగల్, పెద్దపల్లి, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్ జిల్లాలు విమానాశ్రయాలకు అనకూలమేనని నాలుగేండ్ల క్రితమే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) నివేదిక ఇచ్చింది. అయినప్పటికీ తుది నివేదికను మాత్రం ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నది. కానీ.. అంధజ్యోతి మాత్రం వీటిని ప్రస్తావించకుండా ఓ గాలి వార్త రాసేసింది. సీఎం కేసీఆర్ స్వయంగా కేంద్రమంత్రిని కలిసిన విషయాన్ని చెప్పకుండా బీజేపీ వాళ్లు చెప్పినదే వేదంగా వార్త ప్రచురించింది.
కేంద్రం జాబితాలో భద్రాద్రి ఊసేదీ
తెలంగాణ సిద్ధించకముందే అప్పటి విమానయానశాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. 2015 నుంచి 2017 వరకు అనేకసార్లు ఏఏఐ అధికారులు ఎయిర్‌పోర్టుకు అవసరమైన భూమి కోసం క్షేత్రస్థాయిలో పర్యటించారు. తొలుత లక్ష్మీదేవిపల్లి మండలం పునుకుడు చెలకలోని భూమిని చూశారు. అది వన్యప్రాణి సంరక్షణ పరిధిలోని ఉండడంతో ప్రతిపాదనను పక్కన పెట్టారు. తర్వాత పాల్వంచ మున్సిపాలిటీ పరిధి బంగారు జాలలోని 999 సర్వే నంబర్లో వెయ్యి ఎకరాల స్థలాన్ని పరిశీలించారు. ఆమోదం కోసం 2020లో కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. తిరిగి 2021 జూన్ 25న ఏఏఐ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి స్థలాన్ని పరిశీలించారు.
తర్వాత కొన్నిరోజులకు ఓ ప్రైవేటు సంస్థ ద్వారా భూసర్వే పూర్తి చేయించారు. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కు సైతం ప్రతిపాదనలు వెళ్లాయి. అయినా కేంద్రం స్పందించలేదు. నిరుడు కొత్త విమానాశ్రయాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్రం సంప్రదింపులు జరిపింది. ఈ చర్చల్లో వరంగల్ (మామునూర్), నిజమాబాద్ (జక్రాన్‌పల్లి) విమానాశ్రయాల గురించి తప్ప కొత్తగూడెం ఎయిర్‌పోర్టు ఏర్పాటు ఊసే లేకపోవడం గమనార్హం. కొత్తగూడెం సమీపంలో వెయ్యి ఎకరాలను ఏఏఐ అధికారులు గుర్తించినా కేంద్రం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం జాగానే చూపలేదంటూ కుంటి సాకులు చెబుతున్నది. ఈ నిజాలన్నింటినీ అంధజ్యోతి దాచేసి తనకు నచ్చినట్టుగా ఓ అసత్యపు వార్తను రాసేసింది.
రాష్ట్రం ఓకే.. కేంద్రం నాట్ ఓకే
మామునూరు విమానాశ్రయానికి రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. ఈ విషయంలో మంత్రి కేటీఆర్ పలుమార్లు ఏఏఐ ఉన్నతాధికారులత్లో మాట్లాడారు. అయితే, ప్రస్తుతం ఉన్న భూమికి తోడు రన్‌వే విస్తరణకు అనంగా 253 ఎకరాల అదనపు భూమిని తమకు అప్పగిస్తే విమానాశ్రయ పునరుద్ధరణ సాధ్యమవుతుందని పేర్కొంది. ఈ పరిస్థితుల్లో 2022 మే 7న మంత్రి కేటీఆర్ స్వయంగా పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ తదితరులతో కలిసి మామునూరు ఎయిర్‌పోర్టును సందర్శించారు. ఏఏఐ ప్రతిపాదించిన 253 ఎకరాల భూమిని సేకరించేందుకు అధికారులు రూపొందించిన మ్యాప్‌ను పరిశీలించారు. భూమిని సేకరించేందుకు సర్వే జరిపి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. గత జూలై 31న జరిగిన రాష్ట్ర మంత్రి వర్గం సమావేశంలో మామునూరు ఎయిర్‌పోర్టుకు 253 ఎకరాల భూమిని అప్పగించాలని తీర్మానించినట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏఏఐ దృష్టికి తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలో ఎయిర్‌పోర్టు పునరుద్ధరణ పనులను కేంద్ర ప్రభుత్వం మొదలు పెట్టాల్సి ఉంది. అయితే, ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నది. అసలు విషయం ఇదైతే అంధజ్యోతి మాత్రం మామునూరు ఎయిర్‌పోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం జాగా ఇవ్వడం లేదంటూ ఓ కథనాన్ని వండివార్చేసింది.
మామునూరు ఎయిర్‌పోర్టు పునరుద్ధరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి పట్టుదలతో ఉన్నది. సీఎం కేసీఆర్ మొదలు మంత్రి కేటీఆర్ వరకు ఈ విషయంలో పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. పౌరవిమానయానశాఖ, ఏఏఐ, శంషాబాద్ జీఎంఆర్ ఎయిర్‌పోర్టుతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు, ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగిస్తున్నది. తాజాగా.. 31.7.2023లో జరిగిన కేబినెట్ సమావేశంలో రాష్ట్రంలో ఎయిర్‌పోర్టులతోపాటు మామునూరు ఎయిర్‌పోర్టుపైనా నిర్ణయం తీసుకున్నారు. మామునూరు ఎయిర్‌పోర్టు నిర్మాణానికి స్థలం కేటాయిస్తూ 10.8.2023న జీవో ఎంఎస్ నంబర్ 36ను ప్రభుత్వం జారీ చేసింది. దీనికి అనుగుణంగా 253 ఎకరాల భూమిని ఏఏఐకి పూర్తి ఉచితంగా రన్‌వే పొడిగింపునకు అనుకూలంగా ఇవ్వడానికి అంగీకరించింది. హైదరాబాద్ శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి మామునూరు ఎయిర్‌పోర్టు 145 కిలోమీటర్ల ఏరియల్ డిస్టెన్స్‌లో ఉన్నందున నో అబ్జక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉన్నది. దీనికోసం హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ సీఈవోకు ఆగస్టు 10న లేఖ రాసింది. వరంగల్‌లోని మామునూరు ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేసి విమానాల రాకపోకలు పునరుద్ధరించేలా ఏఏఐ చర్యలు తీసుకునేందుకు అవకాశం కల్పించాలని ఆ లేఖలో పేర్కొన్నది. అయినప్పటికీ ఏఏఐ నుంచి ఎటువంటి ప్రతిస్పందన రాలేదు. తప్పులన్నీ కేంద్రం దగ్గర ఉన్నప్పటికీ.. అంధజ్యోతికి మాత్రం ఇవేమీ కనిపించకపోవడం గమనార్హం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

