హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తేతెలంగాణ) : టీటీడీ పరకామణి చోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీఐడీకి కీలక సూచనలు చేసింది. కేసులో నిందితుడిగా ఉన్న రవికుమార్, ఆయన కుటుంబసభ్యుల లావాదేవీలపై సీఐడీ విచారణ నివేదిక అందినట్టు పేర్కొన్న హైకోర్టు మరికొన్ని అంశాలపై ఇంకా విచారణ చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడింది.
కేసులో భిన్న అంశాల నేపథ్యంలో విడిగా ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలనే అంశాన్ని పరిశీలించాలని సీఐడీకి సూచించిన కోర్టు, తదుపరి విచారణను జనవరి 5వ తేదీకి వాయిదా వేసింది.