న్యూఢిల్ల్లీ, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): వరదల వల్ల నష్టపోయిన తెలంగాణ, ఏపీలకు తక్షణసాయం అందించేందుకు కూడా కేంద్ర ప్రభుత్వానికి చేతులు రాలేదు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ నిధి (ఎస్డీఆర్ఎఫ్) నుంచి రెండు తెలుగు రాష్ట్రాలు రూ.3,448 కోట్లు తీసుకోవాలని కేంద్రం ఉచిత సలహా ఇచ్చింది.
ఈ విధంగా తక్షణ సాయం అందించినట్టుగా కేంద్రం చెప్పుకుంటున్నది. ఆ నిధులను వాడుకునేందుకు ప్రక్రియను మొదలుపెట్టినట్టు వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రాల వద్ద కేంద్రం వాటా కూడా ఉన్నదని తెలిపింది.