జ్యోతినగర్ ;పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పట్టణ పరిధి మూడో డివిజన్ మేడిపల్లిలో పోచమ్మగుడి పునర్నిర్మాణంలో భాగంగా శుక్రవారం చేపట్టిన మట్టి తవ్వకాల్లో పురాతన పానపట్టం బయల్పడింది. సుమారు 6 ఫీట్ల లోతులో శివలింగానికి సంబంధించిన పానపట్టం కనిపించిందని, పురావస్తు శాఖ అధికారులు దీనిని పరిశీలిస్తే మరిన్ని చారిత్రక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని డివిజన్ కార్పొరేటర్ కుమ్మరి శ్రీనివాస్ తెలిపారు.