జఫర్‌గఢ్‌లో జైన బసది అవశేషాలు
జనగామ జిల్లా జఫర్‌గఢ్ ఖిల్లా దిగువన పాటిగడ్డపై ప్రాచీన జైన బసది అవశేషాలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు, వేల్పుగొండ వాసి సముద్రాల రాజు గుర్తించారు. రాష్ట్రకూటుల కాలానికి చెందిన ఈ ప్రాంత చరిత్రకు సంబంధించిన కీలక ఆధారాలు ఈ అన్వేషణతో బయటపడ్డాయని భావిస్తున్నారు.
- వేల్పుగొండలో చారిత్రక నిర్మాణం గుర్తింపు
- కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు సముద్రాల రాజు
హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ) : జనగామ జిల్లా జఫర్‌గఢ్ ఖిల్లా దిగువన పాటిగడ్డపై ప్రాచీన జైన బసది అవశేషాలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు, వేల్పుగొండ వాసి సముద్రాల రాజు గుర్తించారు. రాష్ట్రకూటుల కాలానికి చెందిన ఈ ప్రాంత చరిత్రకు సంబంధించిన కీలక ఆధారాలు ఈ అన్వేషణతో బయటపడ్డాయని భావిస్తున్నారు. రాష్ట్రకూట ప్రభువు అమోఘ వర్షుని రాజప్రతినిధి, కొలనుపాక పాలకుడు శంకర గండరస వేల్పుగొండలో కొండపై చెకించిన శాసనం ఆధారంగా ఇకడ దుర్గం నిర్మాణం, కుండం తవ్వకం, జైన బసది ఉనికి ఉన్నట్టు ఇప్పటికే గుర్తంచారు.
అయితే ఇప్పటివరకు జైన బసది ప్రత్యక్ష అవశేషాలు లభించకపోవడం గమనార్హం. సముద్రాల రాజు కొనసాగించిన అన్వేషణలో బయటపడిన శకలాల్లో భారీ ద్వారబంధం భాగాలు, పంచశాఖ శైలిలో చెకిన ద్వారశాఖలు, పూలతలు, హంసల ఆకృతులు, మణిఖచిత పట్టికలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ద్వారబంధం పతంగంపై లలాటబింబంగా ధ్యానాసనంలో ఉన్న మహావీరుని శిల్పం చెక్కినట్టు గుర్తించారు. ఇది జఫర్‌గఢ్‌లో విశిష్టమైన జైన బసది ఉండేదని నిర్ధారించడానికి స్పష్టమైన ఆధారమని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Breast Cancer | రొమ్ము క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేస్తే మళ్లీ వస్తుందా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Pressure Cooker | ప్రెషర్ కుక్కర్లో వంట చేస్తున్నారా.. రుచి తగ్గకుండా ఉండాలంటే ఇలా చేయాలి..
Gang robs women passengers | సిగ్నల్ ట్యాంపరింగ్‌తో రైలు నిలిపి.. మహిళా ప్రయాణికుల నుంచి బంగారం దోచుకున్న ముఠా
Harish Rao | కరువు మండలాలు ప్రకటించడం తప్ప సహాయంపై చేతులెత్తేసిన రేవంత్ : మాజీ మంత్రి హరీష్‌రావు
PCOS | పీసీఓఎస్ సమస్య మహిళల్లో అసలు ఎందుకు వస్తుంది.. ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..?
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

