హైదరాబాద్, జూలై 28(నమస్తే తెలంగాణ): రేషన్ బియ్యం పంపిణీకి సంబంధించిన కమీషన్‌ను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం ఉపాధ్యక్షుడు ఆనంద్‌కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఐదు నెలల కమీషన్ బకాయి ఉండటంతో రేషన్ డీలర్లంతా తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
ఇప్పటికే ఏప్రిల్, మే నెలల కమీషన్ పెండింగ్‌లో ఉండగా, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒకేసారి జూన్, జూలై, ఆగస్టు నెలల రేషన్ పంపిణీ చేశామని తెలిపారు. రూ. 120 కోట్ల వరకు రావాల్సి ఉన్నదని పేర్కొన్నారు.