ఉరేసుకొని ఆటోడ్రైవర్ మృతి
చెట్టుకు ఉరేసుకొని ఓ ఆటో డ్రైవర్ మృతిచెందాడు. జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం ఈ ఘటన వెలుగుచూసింది.
జీడిమెట్ల, జూన్ 18 : చెట్టుకు ఉరేసుకొని ఓ ఆటో డ్రైవర్ మృతిచెందాడు. జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం ఈ ఘటన వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం కొల్లూర్‌కు చెందిన ఎరుకల లక్ష్మణ్(34) కొన్నేండ్ల కిందట తన భార్య నాగమణి, ముగ్గురు పిల్లలతో కలిసి నగరానికి వలస వచ్చాడు. పద్మానగర్ ఫేస్-2లో నివాసముంటూ ఆటో నడుపుకొంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
ఆస్తి విషయంలో తన అన్నదమ్ములతో మాట్లాడేది ఉందని తన భార్యకు చెప్పి సోమవారం తన స్వగ్రామానికి వెళ్లాడు. సాయంత్రం తన భార్య ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది. రాత్రి తన అత్త లక్ష్మమ్మమ్మకు ఫోన్‌చేస్తే ఇంకా ఇంటికి రాలేదని, ఎక్కడో ఉండి ఉంటాడని ఉదయాన్నే వస్తాడని కంగారు పడొద్దని చెప్పింది. మంగళవారం ఉదయం జీడిమెట్ల పోలీసులు నాగమణికి ఫోన్‌చేసి కుత్బుల్లాపూర్ మున్సిపల్ కార్యాలయం పక్కన ఉన్న చెట్టుకు ఉరేసుకొని ఒకరు చనిపోయారని తెలపడంతో వెళ్లిచూసి తన భర్త లక్ష్మణ్‌గా గుర్తించింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియకపోవడంతో మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

