ఆదివాసీల హక్కులు హరించేయత్నం
కేంద్రం ఆమోదించిన అటవీ సంరక్షణ నియమాలు ఆదివాసీల హక్కులను కాలరాసేలా ఉన్నాయని వివిధ ఆదివాసీ, రైతు సంఘాల నాయకులు ధ్వజమెత్తారు. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్త పోరాటాలు చేస్తామని పేర్కొన్నారు.
- వారిని అడవి నుంచి నెట్టే కుట్ర
- సామాజిక కార్యకర్త మేధాపాట్కర్
చిక్కడపల్లి, అక్టోబర్ 15 : కేంద్రం ఆమోదించిన అటవీ సంరక్షణ నియమాలు ఆదివాసీల హక్కులను కాలరాసేలా ఉన్నాయని వివిధ ఆదివాసీ, రైతు సంఘాల నాయకులు ధ్వజమెత్తారు. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్త పోరాటాలు చేస్తామని పేర్కొన్నారు. అఖిలభారత ఆదివాసీ, రైతు సంఘాల ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశం జరిగింది. నర్మదా బచావో ఆందోళన్ ప్రతినిధి, సామాజిక కార్యకర్త మేధాపాట్కర్ మాట్లాడుతూ కేంద్రం తీసుకొచ్చిన చట్టాలు ఆదివాసీల హక్కులను హరించేలా ఉన్నాయని, విలువైన అటవీ సంపదను కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టే విధంగా ఉన్నాయని మండిపడ్డారు.
మోదీ ప్రభుత్వం అడవి సంరక్షణ నియమాల ద్వారా ఆదివాసీలను అడవుల నుంచి నెట్టివేసే కుట్ర చేస్తున్నదని, పెట్టుబడిదారులకు గులాంగిరి చేస్తున్నదని దుయ్యబట్టారు. అడవులు నశిస్తే ఆదివాసీలకే కాదు.. మొత్తం దేశానికే నష్టమని వివరించారు. అటవీ సంరక్షణకు ఢిల్లీ రైతు ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఏఐకేఎంఎస్ అధ్యక్షుడు వేముపల్లి వెంకట్రామయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జాగృతి దళ్ నేత్ మాధురి, మాజీ ఎంపీ మిడియం బాబూరావు, మండల వెంకన్న, విజయ్ ఉపాధ్యాయ్, కృష్ణప్రసాద్, రంగారెడ్డి, అశోక్, వెంకటేశ్వర్లు, ప్రసాద్, ఉపేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

