హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ) : సర్కారు జూనియర్ కాలేజీలో పారిశుధ్య నిర్వహణ బాధ్యతలను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు అప్పగించారు. సర్కారు బడుల్లో పారిశుధ్యాన్ని ఈ కమిటీలకే అప్పగించగా, తాజాగా సర్కారు కాలేజీల పారిశుధ్య నిర్వహణను సైతం అప్పగించారు. పారిశుధ్య నిర్వహణకు కాలేజీలకు ఫెసిలిటీ మెయింటెనెన్స్ గ్రాంట్‌ను మంజూరుచేశారు. ఏడాదిలో 11 నెలలకు నిధులు కేటాయిస్తారు. విద్యార్థుల సంఖ్యను బట్టి ఈ నిధులు ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని 430 జూనియర్ కాలేజీలకు జూన్, జూలై మాసాల నిధులు రూ. 95.62కోట్లను కాలేజీ ప్రిన్సిపాల్ అకౌంట్లలో జమచేసినట్టు ఇంటర్ విద్యా డైరెక్టర్ కృష్ణఆదిత్య తెలిపారు. ఈ నిధులు వినియోగించి, యూటిలైజేషన్ సర్టిఫికెట్లు సమర్పించగానే మిగతా నిధులు మంజూరుచేస్తామని పేర్కొన్నారు.