హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ) : బీజేపీ తుక్కుగూడ సభ ద్వారా ఎవరికి ఎవరు భయపడుతున్నారో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రసంగం విన్న వారికి ఇట్టే అర్థమవుతుంది. అమిత్ షా తన ప్రసంగంలో సీఎం కేసీఆర్ పేరును పదే పదే ప్రస్తావించారు.
ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు, కేసీఆర్, సీఎం కేసీఆర్.. అంటూ 30 నిమిషాల తన ప్రసంగంలో మొత్తం 18 సార్లు కేసీఆర్ పేరును ప్రస్తావించారు. తన అరగంట ప్రసంగంలో అమిత్‌షా సభ ఉద్దేశాన్ని, పార్టీ కార్యక్రమాలను వివరించకుండా, కేంద్రప్రభుత్వం ఏం చేసిందో చెప్పకుండా పదే పదే కేసీఆర్ నామస్మరణ చేశారు. దీంతో ఎవరు ఎవరికి భయపడుతున్నారో అందరికీ అర్థమయ్యిందని తెలంగాణవాదులు అంటున్నారు.