Shankar Goud | ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ అంత్యక్రియలు పూర్తి..!
Shankar Goud : ఆర్టీసీ సమ్మె రెండో రోజు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి కన్నుమూసిన కోల శంకర్ గౌడ్ (Shankar Goud) అంత్యక్రియలు పూర్తయ్యాయి. అడుగడుగునా పోలీసుల నిర్భందం కొనసాగగా ముత్తోజిపేటలో తీవ్ర ఉద్రిక్తతల నడుమ శంకర్ గౌడ్‌కు కుటుంబసభ్యులు, ఆర్టీసీ ఉద్యోగులు కన్నీటి నివాళి అర్పించారు.
Shankar Goud : ఆర్టీసీ సమ్మె రెండో రోజు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి కన్నుమూసిన కోల శంకర్ గౌడ్ (Shankar Goud) అంత్యక్రియలు పూర్తయ్యాయి. అడుగడుగునా పోలీసుల నిర్భందం కొనసాగగా ముత్తోజిపేటలో తీవ్ర ఉద్రిక్తతల నడుమ శంకర్ గౌడ్‌కు కుటుంబసభ్యులు, ఆర్టీసీ ఉద్యోగులు కన్నీటి నివాళి అర్పించారు. ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్ల సాధనకు, కాంగ్రెస్ ప్రభుత్వంలో చలనం తీసుకు వచ్చేందుకు ప్రాణాలు అర్పించిన ఆయనకు వీడ్కోలు పలికేందుకు జనం భారీగా తరలివచ్చారు. శంకర్ గౌడ్ అమర్‌రహే నినాదాలతో.. కళాకారుల ఆటపాటలతో అంతిమయాత్ర సాగింది.
నర్సంపేట డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్న కోల శంకర్ గౌడ్ గురువారం సమ్మెలో పాల్గొని.. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఆయన్ను తొలుత నర్సంపేట ఆస్పత్రికి, ఆపై వరంగల్‌లోని ఎంజీఏ ఆస్త్రత్రికి తరలించారు. 80 శాతం కాలిన గాయాలతో శంకర్ గౌడ్ పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించాలనుకున్నారు. కానీ, దురదృష్టవశాత్తూ ఆయన మార్గమధ్యలోనే మరణించారు.
శుక్రవారం ఉదయం శంకర్‌గౌడ్ మృతదేహాన్ని ముత్తోజిపేటకు తీసుకొచ్చిన పోలీసులు..కుటుంబానికి అప్పగించారు. అయితే.. ప్రభుత్వ వైఖరితోనే శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్నారని ఆర్టీసీ జేఏసీ నేతలు ఆయన మృతదేహాన్ని నర్సంపేట డిపో వద్దకు తీసుకెళ్లాలని భావించారు. బీజేపీ ఎంపీ బండి సంజయ్, ఆర్టీసీ నాయకుల ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దాంతో, ముత్తోజిపేటలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. చివరకు ఆర్టీసీ జేఏసీ నేతలతో పోలీసులు మంతనాలు జరిపి.. అంత్యక్రియలు పూర్తి చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
Bathukamma | బతుకమ్మకూ నీళ్లులేవు.. కాంగ్రెస్ తెచ్చిన దుర్గతి… వరంగల్ జిల్లా ఆరెపల్లిలో కాలువకు బావినీరే గతి
IND vs WI | ఎవరిదో ఫైనల్ పంచ్.. నేడు భారత్-వెస్టిండీస్ చివరి టీ20!
Starlink vs Jio | పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

