హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ) : 214 సెంటీమీటర్ల హైట్ ఉన్న కండక్టర్ అమీన్ అహ్మద్ అన్సారీ.. బస్‌భవన్ చుట్టూ తిరిగినా అవ్వని పని.. అతను సోషల్ మీడియాలో కండక్టర్‌గా తిరిగి ప్రత్యక్షమవడంతో క్షణాల్లో పూర్తయింది. అతని ఎత్తు దృష్ట్యా ఆర్టీసీలో కండక్టర్ కాకుండా మరేదైనా ఉద్యోగం ఇవ్వాలని నిరుడు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. దీంతో నాటి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అతనికి మెహిదీపట్నం డిపోలోనే డాటా ఎంట్రీ ఆపరేటర్‌గా ఉద్యోగం కల్పించారు.
అయితే, దానికి ఒక్క ఏడాదికి మా త్రమే పరిమితి విధించడం, సాక్షాత్తు సీఎం ఆదేశాలను బేఖాతర్ చేస్తూ.. ఈ ఏడాది రెన్యువల్ చేయకపోవడంతో అమీన్ అన్సారీ పలుమార్లు బస్‌భవన్ చుట్టూ తిరిగారు. ఆర్టీసీ ఉన్నతాధికారులు నిరాకరించడంతో ఆయన మంగళవారం మళ్లీ కండక్టర్‌గా వి ధుల్లో చేరాల్సి వచ్చింది. అతని హైట్, ఫిజిక్ చూసి కొందరు ప్రయాణికులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ విషయాన్ని ‘తెలుగు స్ర్కైబ్’ డిజిటల్ మీడియా వార్తగా పోస్టు చేయడంతో.. సీఎంవో నుంచి బస్‌భవన్‌కు ఆదేశాలు వెళ్లాయి. అతను రె న్యువల్ కోసం వచ్చినప్పుడు ఎందుకు చేయరంటూ తలంటడంతో.. గంటల వ్యవధిలోనే పిలిచి ఎప్పటిలాగే ఉద్యోగం ఇచ్చారు.