హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ భూ ములను జేఎన్ఏఎఫ్ఏకి అప్పగించొద్దంటూ నిరసనలు కొనసాగుతున్నాయి. వర్సిటీకి చెం దిన పలువురు ఉద్యోగులు శనివారం నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగ జేఏసీ కన్వీనర్ ప్రొ ఫెసర్ వడ్డాణం శ్రీనివాస్ మాట్లాడు తూ సమాజానికి ఎంతో మంది వి ద్యావంతులను అందించిన ఓపెన్ యూనివర్సిటీ పట్ల ప్రభుత్వ వైఖరి సరైనదికాదని తెలిపారు. ఉద్యోగ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ పల్లవి కాబ్డే, సెక్రెటరీ జనరల్ మహేశ్‌గౌడ్, జేఏసీ నేతలు డాక్టర్ యాకేశ్ దైద, కాంతం ప్రేమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.