హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ప్రాంగణంలో అంబేద్కర్ జ యంతిని గురువారం ఘనంగా నిర్వహించను న్నారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సహా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులు హాజరై అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించనున్నారు.
అస్సాం రాజధాని గువాహటిలో మూడు రోజులపాటు పర్యటించిన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి వీ నర్సింహాచార్యులు బుధవారం హైదరాబాద్‌కు చేరుకొన్నారు. 8వ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (సీపీఏ) ఇండియా రీజియన్ కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు మండలి చైర్మన్, స్పీకర్ గువాహటి వెళ్లిన విషయం తెలిసిందే.