హైదరాబాద్: డాక్టర్ భీమ్రావ్ రామ్‌జీ అంబేద్కర్(Bhimrao Ramji Ambedkar).. మధ్యప్రదేశ్‌లోని మోవో కాంటోన్మెంట్‌లో 1891, ఏప్రిల్ 14వ తేదీన జన్మించారు. మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఆయన తన ప్రైమరీ స్కూల్ విద్యను పూర్తి చేశారు. బాంబేలోని ఎల్ఫిన్‌స్టోన్ హైస్కూల్లో సెకండరీ విద్యను అభ్యసించారు. దేశంలో వివక్ష తీవ్ర స్థాయిలో ఉన్న దశలో ఆయన విద్యను అభ్యసించడం గమనార్హం. షెడ్యూల్ కులాల వర్గ ప్రజలను అప్పట్లో అంటరానివారిగా చూసేవారు. అలాంటి పరిస్థితుల్లో అంబేద్కర్ చదువు పట్ల తన శ్రద్ధను వదులుకోలేదు. సమాజం కఠినంగా ఉన్నా.. అంతకన్న రెట్టింపు దీక్షతో స్కూలింగ్ పూర్తి చేశాడు. స్కూల్లో ఉన్న కామన్ వాటర్ ట్యాప్ వద్ద నీళ్లను తాగనివ్వలేదన్న విషయాన్ని ఆయన తన ఆటోబయోగ్రఫీ ‘వెయిటింగ్ ఫర్ ఎ వీసా’లో రాశారు.
1912లో బాంబే యూనివర్సిటీ నుంచి అంబేద్కర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్‌లో ఆయన బీఏ చేశారు. కాలేజీలో పర్ఫార్మెన్స్ చూసి 1913లో ఆయనకు సయ్యాజిరావు గైక్వాడ్ స్కాలర్షిప్ను అందజేశారు. అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న కొలంబియా యూనివర్సిటీలో ఎంఏ, పీహెచ్డీ చదువుకునేందుకు బరోడా రాష్ట్ర మహారాజు కూడా ఆయన స్కాలర్షిప్ అందజేశారు. ద అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్ ఆఫ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ థీసీస్ టైటిల్‌తో ఆయన 1916లో మాస్టర్స్ పూర్తి చేశారు. ద ఎవల్యూషన్ ఆఫ్ ప్రావిన్షియల్ ఫైనాన్స్ ఇన్ ఇండియా: ఎ స్టేడీ ఇన్ ద ప్రావిన్షియల్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఇంపీరియల్ ఫైనాన్స్ అన్న టైటిల్‌తో ఆయన పీహెచ్డీ థీసీస్ రాశారు.
అంబేద్కర్ కీర్తి అజరామరం.. అంబేద్కర్ స్ఫూర్తి చిరస్మరణీయం!
అణగారినవర్గాల అభ్యున్నతికి అహర్నిశలు శ్రమించిన మహనీయులు అంబేద్కర్.
పీడిత ప్రజల పక్షాన పోరాడిన విశ్వమానవుడు అంబేద్కర్.
సబ్బండ వర్గాల ప్రజలకు హక్కులు పంచిన సమ సమాజ స్వాప్నికుడు అంబేద్కర్.
భారత రాజ్యాంగానికి రూపకల్పన… pic.twitter.com/uAkpKjFjSN
— KTR (@KTRBRS) April 14, 2026
కొలంబియా యూనివర్సిటీలో పీజీ పూర్తి చేశాక, అంబేద్కర్ లండన్‌కు వెళ్లారు. అక్కడ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్‌లో రిజిస్టర్ చేసుకున్నారు. ఆర్థికశాస్త్రాన్ని చదివేందుకు ఆయన రిజిస్టర్ చేశారు. ఇక గ్రేస్ ఇన్‌లో ఆయన న్యాయ విద్య అభ్యసించేందుకు ఎన్రోల్ చేసుకున్నారు. అయితే డబ్బు సరిపోకపోవడం వల్ల ఆయన 1917లో ఇండియాకు తిరిగి వచ్చారు. 1918లో ముంబైలోని సిడెనం కాలేజీలో పొలిటికల్ ఎకానమీ ప్రొఫెసర్‌గా విధుల్లో చేరారు. కాలేజీలో ప్రొఫెసర్‌గా చేస్తున్న సమయంలోనే యువత ఓటు హక్కు గురించి సౌత్‌బరో కమిటీకి ఆయన ఓ స్టేట్మెంట్ అందజేశారు.
1920లో అంబేద్కర్ మళ్లీ లండన్ వెళ్లారు. కొల్హాపూర్‌లోని ఛాత్రపతి సాహూజీ మహారాజ్ నుంచి ఆర్థిక సాయం పొందారు. వారితో పాటు ఓ మిత్రుడు తీసుకున్న పర్సనల్ లోన్, ఇండియాలో పనిచేసిన డబ్బులతో ఆయన లండన్‌కు వెళ్లారు. విద్యను సంపూర్ణంగా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ఆయన లండన్‌కు వెళ్లాల్సి వచ్చింది. 1922లో ఆయనకు బార్ నుంచి పిలుపు వచ్చింది. ఆ తర్వాత ఆయన బారిస్టర్ అయ్యారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి ఆయన ఎంఎస్సీ, డీఎస్సీ పూర్తి చేశారు. ద ప్రాబ్లం ఆఫ్ ద రూపీ పేరుతో ఆయన డాక్టరేట్ థీసీస్‌ను ప్రచురించారు.
భారత్‌కు తిరిగివచ్చిన తర్వాత అంబేద్కర్ ఓ సంస్థను స్థాపించారు. బహిష్కృత్ హితకర్ణి సభను ఆయన ఏర్పాటు చేశారు. దాని ఆధారంగా ఆయన సామాజిక ఉద్యమాలు చేపట్టారు. 1927లో ఆయన మహద్ సత్యాగ్రహం చేపట్టారు. భారత సమాజంలో అణిచివేతకు గురైన కులాల వారికి ప్రజా వనరులు సమంగా దక్కాలని ఆయన ఆ వేదికగా డిమాండ్ చేశారు. ఇక ఆ సంవత్సరంలో ఆయన బాంబే లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఓ సభ్యుడిగా నామినేట్ అయ్యారు.
Tributes to Dr. Babasaheb Ambedkar on his birth anniversary. His efforts towards nation building are deeply motivating. His life and work continue to inspire generations to build a just and progressive society. pic.twitter.com/MWHUTlpf9Y
— Narendra Modi (@narendramodi) April 14, 2026
1928లో రాజ్యాంగ సంస్కరణల గురించి సైమన్ కమిషన్ ముందు ఆయన కొన్ని వినతులు సమర్పించారు. ఇండియన్ స్టాట్యూటరీ కమిషన్‌గా భావించే సైమన్ కమిషన్ ముందు ఆయన మూడు సార్లు రౌండ్‌టేబుల్ సమావేశాలకు హాజరయ్యారు. 1930 నుంచి 32 మధ్యకాలంలో ఆ కాన్ఫరెన్సులు జరిగాయి. ఆ సమయంలో అంబేద్కర్ తన విన్నపాలు అందజేశారు. 1935లో ముంబైలోని గవర్నమెంట్ లా కాలేజీలో ప్రిన్సిపాల్‌గా నియమితుడయ్యారు. 1928 నుంచి ఆ కాలేజీలోనే ఆయన ప్రొఫెసర్‌గా పాఠాలు బోధించారు. వైస్రాయ్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఆయన కార్మిక సభ్యుడిగా నియమితుడయ్యారు.
1946లో భారత రాజ్యాంగ పరిషత్(కాన్స్టూటూయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా)కి ఎన్నికయ్యారు. 1947 ఆగస్టు 15వ తేదీన భారత దేశ తొలి న్యాయశాఖ మంత్రిగా అంబేద్కర్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యాంగ పరిషత్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మెన్‌గా ఆయన్ను ఎన్నుకున్నారు. ఆ తర్వాత ఆయన భారతీయ రాజ్యాంగాన్ని రాసే ప్రక్రియకు పూనుకున్నారు. భారతీయ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌పై ప్రశంసల జల్లు కురిసింది. రాజ్యాంగ పరిషత్ సభ్యులు మహావీర్ త్యాగి, తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ .. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని విశేషంగా మెచ్చుకున్నారు. ఎంతో అంకితభావం, ఉత్సాహంతో అంబేద్కర్ రాజ్యాంగ ముసాయిదాను రూపొందించినట్లు రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మెన్‌గా అంబేద్కర్ అసాధారణ ప్రతిభను కనబరిచినట్లు ఆయన్ను కీర్తించారు.
1952లో జనరల్ ఎలక్షన్స్ తర్వాత ఆయన రాజ్యసభ సభ్యుడయ్యారు. ఆ సంవత్సరంలోనే కొలంబియా యూనివర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్ అందజేసింది. 1953లో హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ కూడా గౌరవ డాక్టరేట్‌ను అందజేసింది. 1955లో ఆయన ఆరోగ్యం క్షీణించింది. 1956 డిసెంబర్ 6వ తేదీన సుదీర్ఘ అస్వస్థత వల్ల ఢిల్లీలో అంబేద్కర్ తన తుదిశ్వాస విడిచారు.
అంబేద్కర్ గురించిన రాసిన ఈ వ్యాసం సుప్రీంకోర్టు వెబ్సైట్లోనిది. న్యాయవాదిగా రిజిస్టర్ చేసుకుని వందేళ్లు పూర్తి అయిన సందర్భంలో అంబేద్కర్‌ను స్మరిస్తూ ఈ వ్యాసాన్ని పోస్టు చేశారు. అంబేద్కర్ కఠోర శ్రమ ఆయన్ను ఉన్నత విద్యావంతుడిగా తీర్చిదిద్దింది. సమాజంలో అసమానతలు ఉన్నా.. ఆయన మాత్రం తన చదువును ఆపలేదు. విద్యార్జనకు, వ్యక్తి ఔనత్యానికి, సమాజ సేవకు అంటరానితనం లేదని తన ఎదుగుదలతో ఆయన నిరూపించారు. చదువుతో సంస్కారాన్ని, సమాజాన్ని మార్చే ప్రయత్నం చేశారు. అందుకే అంబేద్కర్ ఆశయాలను స్పూర్తిగా తీసుకుందాం. ఆయన రాజ్యాంగాన్నే పాటిద్దాం. ఆత్మసాక్షిగా ఆచరిద్దాం.
डॉ. बाबासाहेब अम्बेडकर का व्यक्तित्व और कृतित्व राष्ट्र निर्माण के लिए प्रेरणापुंज बना रहेगा।
अयं निजः परो वेति गणना लघुचेतसाम्।
उदारचरितानां तु वसुधैव कुटुम्बकम्॥ pic.twitter.com/3DAguZY08g
— Narendra Modi (@narendramodi) April 14, 2026