హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌కు ఉజ్బెకిస్థాన్‌లోని బుఖా రా సోదర నగరం (సిస్టర్ సిటీ) అని, భవిష్యత్తులో తెలంగాణతో కలిసి పనిచేస్తామని ఆ దేశ రాయబారి దిల్షోద్ అఖ్మటోవా తెలిపారు. టాలీవుడ్‌ను తమ దేశానికి ఆహ్వానిస్తున్నామని, షూటింగ్‌లకు వస్తే ప్రత్యేక రాయితీలు కల్పించి, అన్నివిధాలా సహకరిస్తామన్నారు. హైదరాబాద్ సోమాజిగూడలోని హోటల్ పార్కులో శుక్ర వారం ఎఫ్‌టీసీసీఐ బృందం దిల్హోద్ అఖ్మటోవాతో భేటీ అయ్యింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ఐటీ, ఫార్మా, టూరిజం, హెల్త్‌కేర్ అండ్ ట్రైనింగ్ రంగాలు అద్భుతంగా ఉన్నాయని, ఎంతో మందికి ఉద్యో గ అవకాశాలు కల్పిస్తున్నాయని ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలను పరిశీలించి ఉజ్బెకిస్థాన్‌లో అమలు చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఇక్కడి ఆంగ్ల ఉపాధ్యాయులు ఉజ్బెకిస్థాన్‌కు వస్తే మంచి వేతనం ఇస్తామని తెలిపారు. ఈ భేటీలో ఎఫ్‌టీసీసీఐ టూరిజం కమిటీ చైర్మన్ వాల్మీకి హరికిషన్, సభ్యులు గణేశ్‌రావు, హేమంత్ టీ పాండ్య, ఏవీ ప్రవీణ్, డీ రామచంద్రన్, డీవీజీ నాగేంద్రరావు, అవినాశ్ కుమార్, దినేశ్ కుమార్, సిరాజ్ అన్సారీ పాల్గొన్నారు.