హైదరాబాద్, జనవరి 7(నమస్తే తెలంగాణ) : అల్వాల్ టిమ్స్ దవాఖాన నిర్మాణం పనులు ఆగస్టు 31నాటికి పూర్తి చేసి ప్రారంభిస్తామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. అలాగే డిసెంబర్‌నాటికి సనత్‌నగర్, ఎల్బీనగర్ టిమ్స్‌లను పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు పేర్కొన్నారు. మంత్రి కోమటిరెడ్డి మంగళవారం అల్వాల్ టిమ్స్ పనుల పురోగతిని పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. దవాఖానల్లో రోగు ల సౌకర్యార్థం అల్వాల్ టిమ్స్‌లో ధర్మశాల ఎందుకు నిర్మించడంలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.