కేపీహెచ్‌బీకాలనీ, డిసెంబర్ 17: జేఎన్టీయూహెచ్ వర్సిటీ అభివృద్ధికి మొదటి బ్యాచ్ (1971) పూర్వవిద్యార్థి, వ్యాపారవేత్త, గోల్డ్‌డ్రాప్ అధినేత కానాహైలాల్ లోహియా రూ.కోటి విరాళాన్ని అందించడానికి ముందకు రావడం అభినందనీయమని వర్సిటీ వైస్ చాన్సలర్ కట్టా నర్సింహారెడ్డి అన్నారు. ఆదివారం వర్సిటీ వీసీ చాంబర్లో పలు బ్యాచ్‌లకు చెందిన పూర్వవిద్యార్థులతో వీసీ నర్సింహారెడ్డి, రెక్టార్ గోవర్ధన్, రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్ సమావేశమయ్యారు.
ఇందులో పూర్వవిద్యార్థి, గోల్డ్‌డ్రాప్ అధినేత కానాహైలాల్ లోహియా కోటి విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా వీసీ నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. పూర్వవిద్యార్థులంతా వర్సిటీ అభ్యున్నతి కోసం ముందుకు రావడం సంతోషకరమని చెప్పారు. త్వరలోనే పూర్వవిద్యార్థుల సమ్మేళనం వైభవంగా నిర్వహించనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో యూఐఐసీ డైరెక్టర్ తారకల్యాణి, డిప్యూటీ డైరెక్టర్ క్రాంతి, ఏఆర్వో ప్రసన్న తదితరులున్నారు.