కరీంనగర్ కమాన్చౌరస్తా, ఏప్రిల్ 21 : ఐఐటీ-జేఈఈ (మెయిన్స్) ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు జాతీయ స్థాయి అత్యుత్తమ ర్యాంకులు సాధించారని విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్ రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. కరీంనగర్లోని విద్యాసంస్థల కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన విద్యార్థులను అభినందించి మాట్లాడారు. ఎం శ్రీపార్టీష్ 29వ ర్యాంకుతో అత్యున్నత స్థానంలో నిలువగా, సీహెచ్ లక్ష్మీహాసిని 116, సీహెచ్ పూర్ణచంద్ 138, ఎస్ వర్జినిరెడ్డి 211, ఎన్ రత్న ప్రకాశ్ 239, పీ అక్షయ 250, ఏ కీర్తన 274, యూ సిద్ధీశ్వర్ 459, కే ధనుష్ 556, కే నచికేత్ 593, బీ లిఖిత్సాయి 737, ఎం వశిష్ట 884, కే ప్రజ్ఞాన్ 991, రెడ్డి శ్రీకర్ 1,000 ర్యాంకు సాధించారని చెప్పారు. వెయ్యిలోపు 14 మంది, 2వేల్లోపు 18 మంది, 5వేల్లోపు 35 మంది ర్యాంకులు కైవసం చేసుకున్నారని, 450 మంది విద్యార్థులు ఐఐటీ అడ్వాన్స్ పరీక్షకు అర్హత సాధించారన్నారు. రాబోయే ఐఐటీ అడ్వాన్స్ పరీక్షకు ఎంపికైన విద్యార్థులకు అత్యుత్తమ అధ్యాపక బృందంతో కోచింగ్ ఇస్తామన్నారు. ప్రతి సంవత్సరం ఐఐటీ, నీట్, ఎప్సెట్ పోటీ పరీక్షల్లో అల్ఫోర్స్ విద్యార్థులు రాణించడం ఆనందంగా ఉందని చెప్పారు. ఇంతటి ఘన విజయానికి తోడ్పడిన అధ్యాపకులు, అధ్యాపకేతర బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.