జనగామ: జనగామ(Jangaon) ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్ ఆధ్వర్యంలో సంక్రాంతి, రిపబ్లిక్ డే సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలో బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ లతో అర్బన్ పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్, రైల్వేస్టేషన్, బతుకమ్మ కుంటతో పాటు జన సంచారం అధికంగా ఉండే ప్రధాన కూడళ్లలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేశారు.
ఈ సందర్భంగా ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్ మాట్లాడుతూ ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. ఎవరైనా అనుమానితుల కదలికలు కనిపిస్తే వెంటనే డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. ఈ తనిఖీల్లో అర్బన్ సీఐ పీ దామోదర్ రెడ్డి, ఎస్సైలు రాజేశ్ కుమార్, భరత్, రాజన్ బాబు, ఏఎస్సై సాంబారెడ్డి, బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది పాల్గొన్నారు.