హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): ఉపాధ్యాయ, ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇవ్వాల్సిన మూడు పెండింగ్ డీఏల మంజూరుకు అనుమతించాలని మాజీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ నేత బీ మోహన్‌రెడ్డి ఎన్నికల సంఘాన్ని కోరారు.
తమ ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకొని, తమకు న్యాయం చేసేలా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పెరిగిన ధరలతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగులు జీవనం కష్టతరంగా మారిందని, కావున డీఏల మంజూరుకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాలని మోహన్‌రెడ్డి కోరారు.