తెలంగాణ జాగృతి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించిన బతుకమ్మ పాట ‘అల్లిపూల వెన్నెల’. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ ఈ పాటకు సంగీతం అందించారు. విలక్షణ దర్శకుడు, నటుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెరకెక్కించారు. ఉత్తరా ఉన్నికృష్ణన్ పాడిన ఈ పాటకు ప్రముఖ రచయిత మిట్టపల్లి సరేందర్ లిరిక్స్ అందించారు.
జాతీయ అవార్డు గ్రహీత బృందం కొరియోగ్రఫీ చేశారు. ఈ పాటను మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు ఎమ్మెట్సీ కల్వకుంట్ల కవిత, దర్శకుడు గౌతమ్ మీనన్ విడుదల చేయనున్నారు. కాపీరైట్ లేకుండా హెచ్డీలో ఈ పాటను విడుదల చేయబోతున్నారు.