యథా నేత తథా మేత..!
నేత చేలో మేస్తే.. దూత గట్టున మేస్తాడా? లీడర్లు అవినీతి దందాల్లో మునిగితే నీడలు ఆకలితో అలమటిస్తాయా? వ్యక్తిగత సహాయకులు ప్రైవేట్ పవర్ సెంటర్లుగా మారారు. కాంట్రాక్టుల నుంచి సెటిల్మెంట్ల దాకా.. బదిలీల నుంచి పోస్టింగుల వరకు..
- అధికార పార్టీ నేతల చుట్టూ అనధికార వ్యవస్థ
- నిత్యం పైరవీలు, సెటిల్మెంట్లు, వసూళ్ల దందాలు
- ఉద్యోగాలు, ఇసుక, కాంట్రాక్టులూ వారి చేతుల్లోనే
- అధికార వ్యవస్థపై పెత్తనం, సమాంతర పాలన
- వ్యక్తిగత సహాయకులే వసూల్ రాజాలు!
- సీఎంవో నుంచి ఎమ్మెల్యే ఆఫీసుల దాకా ఇదే తంతు
- పీఏలు, పీఎస్‌లు, ఓఎస్డీలు, పీఆర్వోలదే హవా
- రాష్ట్రంలో చెలరేగుతున్న ప్రైవేట్ పవర్ సెంటర్లు
నేత చేలో మేస్తే.. దూత గట్టున మేస్తాడా? లీడర్లు అవినీతి దందాల్లో మునిగితే నీడలు ఆకలితో అలమటిస్తాయా? వ్యక్తిగత సహాయకులు ప్రైవేట్ పవర్ సెంటర్లుగా మారారు. కాంట్రాక్టుల నుంచి సెటిల్మెంట్ల దాకా.. బదిలీల నుంచి పోస్టింగుల వరకు.. చందాల నుంచి ఇసుక దందాల దాకా.. వ్యవహారాలన్నీ వాళ్లే చక్కబెడుతున్నారు. నేతల స్కాముల్లోనూ సహాయకులుగా నిలుస్తున్నారు. సీఎంవో నుంచి ఎమ్మెల్యే ఆఫీసుల వరకు పీఏలు, పీఎస్‌లు, ఓఎస్డీలు, పీఆర్వోలదే హవా నడుస్తున్నది. ఇటీవలి వరుస వివాదాలను పరిశీలిస్తే.. వారు తమ పరిధిదాటి ఎంతగా ప్రవర్తిస్తున్నారో, అనధికార ముఠాలుగా ఎలా చెలరేగిపోతున్నారో అర్థమవుతున్నది.
హైదరాబాద్ , నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధుల చుట్టూ ‘ప్రైవేట్ పవర్ సెంటర్లు’ రాజ్యమేలుతున్నాయి. వారి కార్యాలయాల్లో సహాయకులుగా ఉండాల్సిన ప్రైవేట్ సిబ్బంది కొందరు తమ హోదాను అడ్డుపెట్టుకుని అనధికార ముఠాలుగా మారారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పరిపాలనా వ్యవహారాల సమన్వయానికి నియమితులైన ఓఎస్డీలు, పీఏలు, పీఆర్వోలు క్రమంగా పరిధి దాటుతున్నారని, అధికార వ్యవస్థలకు దీటుగా సమాంతర పాలన నడుపుతున్నారనే ఫిర్యాదులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. బదిలీలు, పోస్టింగులు, భూముల సెటిల్మెంట్లు, కాంట్రాక్టుల వ్యవహారాల్లో పైరవీలు చేస్తూ, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
చివరికి ఆయా ప్రజాప్రతినిధులను కలవాలన్నా ఈ మధ్యవర్తుల అనుమతి తప్పనిసరి కావడంతో వారే సుప్రీంగా మారారని ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తంచేస్తున్నారు. దీన్ని నిజం చేస్తూ వరుస ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పీఏ వేధిస్తున్నాడని ఆరోపిస్తూ గన్నేరువరం మండలం గుండ్లపల్లికి చెందిన బేతెల్లి రాజేందర్‌రెడ్డి ఏకంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన సంగతి తెలిసిందే. జూలై 14న జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. చికిత్స పొందుతూ రాజేందర్‌రెడ్డి చనిపోయాడు. ఆయన మృతికి ఎమ్మెల్యే పీఏనే కారణమంటూ కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చేశారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాజేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే పీఏ మధ్య కొంతకాలంగా వివాదం కొనసాగుతున్నదని స్థానికులు సైతం చెప్తున్నారు. ఇసుక వ్యవహారాల్లో పీఏ జోక్యం చేసుకుంటున్నాడని, ట్రాక్టర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడని గతంలో సోషల్ మీడియాలో ఆరోపణలు వచ్చాయని తెలిపారు. రాజేందర్‌రెడ్డి ఈ వ్యవహారాన్ని ప్రశ్నించడంతో వివాదం మొదలైందని చెప్పారు. ఇద్దరి మధ్య వివాదం ముదరడంతో పలుకుబడిని ఉపయోగించి బాధితుడిపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు బనాయించారని ప్రచారం జరుగుతున్నది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం చుట్టూ తిరిగినా న్యాయం దకకపోవడం, పోలీసుల వేధింపులు ఎకువ కావడంతో రాజేందర్‌రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురై ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర సంచలనం సృష్టించింది. అధికార వ్యవస్థలోని ప్రైవేట్ వ్యక్తులు ఎంతలా వేధించి, బలి తీసుకున్నారనేందుకు ఈ ఘటనే నిదర్శనమనే చర్చ జరుగుతున్నది.
10 కోట్లు డిమాండ్ చేసిన మాజీ ఓఎస్డీ?
ప్రైవేట్ సిబ్బంది దందాలు ఎమ్మెల్యేలకే పరిమితం కాలేదు. సచివాలయంలోని మంత్రుల పేషీల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి కొండా సురేఖ వద్ద ఓఎస్డీగా పనిచేసిన సుమంత్ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ ఆరోపణలు పాలన ముసుగులో జరుగుతున్న దందాలను బట్టబయలు చేశాయి. పదవిలో ఉన్నప్పుడు సంపాదించిన పరపతిని అడ్డుపెట్టుకుని సెటిల్మెంట్లు చేయడం, రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించి రూ.కోట్లు డిమాండ్ చేశారనే ఆరోపణలపై పోలీసులు కేసులు నమోదు చేశారని చెప్తున్నారు. సుమంత్‌పై హైదరాబాద్‌లో హత్యాయత్నం కేసు నమోదైంది. రియల్ ఎస్టేట్ వ్యాపారి గొంగిడి హరికృష్ణ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.
తనను డెన్‌కు పిలిపించి ఇనుప రాడ్లతో దాడిచేసి రూ.10 కోట్లు డిమాండ్ చేశారని హరికృష్ణ ఫిర్యాదులో పేరొన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సుమంత్ అంతకుముందు ఒక పారిశ్రామికవేత్త తలకు గన్ గురిపెట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. సుమంత్ కోసం పోలీసులు కొండా సురేఖ ఇంటికి వెళ్లడం, ఆ తర్వాత ఆమె కూతురు సుస్మిత చేసిన ఆరోపణలు, దాని పర్యవసానాలు అందరికీ తెలిసిందే. మరోవైపు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేషీలోనూ పీఆర్వోలు, వ్యక్తిగత సిబ్బంది చక్రం తిప్పుతున్నారని సచివాలయవర్గాల్లో ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ వ్యవస్థల్లో వారు చెప్పినట్టే జరగాలనే రీతిలో వ్యవహరిస్తున్నారని చర్చ సాగుతున్నది. ఒకసారి అధికార కేంద్రానికి దగ్గరైన వ్యక్తులు, పదవులు మారినా ఆ పలుకుబడితో దందాలు కొనసాగిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నేతల పేర్లే పెట్టుబడి
ఈ ప్రైవేట్ వ్యక్తులపై వస్తున్న ఆరోపణల్లో ఎకువగా వినిపిస్తున్న అంశం.. ‘నేతల పేర్ల వినియోగం’. ‘ఎమ్మెల్యే మనిషిని’ అనో, ‘మంత్రి దగ్గరి వ్యక్తిని’.. ‘ఓఎస్డీని’ అనో చెప్పుకుంటూ అధికారులను సంప్రదించడం, పనులు చేసిపెట్టాలని ఒత్తిడి చేయడం, పనులు ఇప్పిస్తామని ఇతరులను మోసం చేయడం, ఉద్యోగాలు, కాంట్రాక్టులు, భూముల వ్యవహారాల్లో మధ్యవర్తిత్వం చేయడం వంటివి చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. వివాదం బయటకు వచ్చిన ప్రతిసారీ ‘మాకు తెలియకుండా మా పేరును ఉపయోగించుకున్నారు’ అని సదరు ప్రజాప్రతినిధులు చెప్పి, తప్పించుకుంటున్నారు. కానీ.. ప్రజాప్రతినిధుల పరోక్ష అండదండలు లేకుండా ఈ తరహా భారీ దందాలు సాధ్యమా? అని ప్రజలు అడుగుతున్నారు.
భద్రాచలంలో పీఏపై వసూళ్ల ఆరోపణలు
ఉద్యోగాల పేరుతో సాగిన భారీ మోసం భద్రాచలంలో వెలుగుచూడటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పేషీలో పీఏగా కొనసాగిన కల్యాణ్ నిరుద్యోగులకు ప్రాజెక్టుల్లో కొలువులు ఇప్పిస్తానంటూ ఒకొకరి వద్ద రూ.10 లక్షల చొప్పున ఏకంగా రూ.15 కోట్ల దాకా వసూలు చేసినట్టు బాధితులు ఆరోపించారు. సదరు పీఏ ఒక అడుగు ముందుకు వేసి, బాధితులకు ఏకంగా నకిలీ నియామక పత్రాలు సైతం అంటగట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. చివరికి ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడి కుమారుడే ఈ మోసానికి గురికావడంతో వివాదం పోలీస్ స్టేషన్ మెట్లెకినట్టు సమాచారం. గతంలో ఇసుక క్వారీల నిర్వాహకులతో సదరు పీఏ రాయబారాలు నడిపి వసూళ్లకు పాల్పడినప్పుడు ఎమ్మెల్యే చూసీచూడనట్టు వ్యవహరించడం వల్లే పరిస్థితి ఇంతదాకా వచ్చిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరోవర్గం మాత్రం సదరు ఎమ్మెల్యే కనుసన్నల్లోనే ఈ వ్యవహారాలు సాగాయని ప్రచారం చేస్తున్నది. ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు ఖాతాలు, నకిలీ నియామక పత్రాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

