కాశీబుగ్గ, జూలై 26 : గ్రేటర్ వరంగల్‌కు చెందిన అధికార పార్టీ నాయకుడు తనను పెండ్లి చేసుకుంటానని మోసం చేశాడని బాధితురాలు ఆరోపించింది. శుక్రవారం ఆమె నగరంలోని ఎల్బీనగర్‌లోగల డీసెంట్ ఫంక్షన్హాల్లో మీడియాతో మాట్లాడారు.
మంత్రి కొండా సురేఖకు ముఖ్య అనుచరుడైన గోపాల నవీన్‌రాజు అనే కాంగ్రెస్ నాయకుడు రెండేండ్ల క్రితం లైంగిక దాడి చేసినట్టు తెలిపింది. దీనిపై కొండా సురేఖ దృష్టికి తీసుకెళితే పెండ్లి చేసి న్యాయం చేస్తానని భరోసా కల్పించినట్టు తెలిపింది. అప్పట్లోనే ఇంతేజార్గంజ్ పోలీస్ స్టేషన్లో జీరో ఎఫ్ఆర్ఐ నమోదు చేసినట్టు పేర్కొన్నది.
నవీన్‌రాజ్ డాక్యుమెంట్లు అన్నీ కొండా సురేఖకు అందజేసినట్టు తెలిపింది.సురేఖ మం త్రి అయిన తరువాత ‘మీరు ఎవరో నాకు తెలియదు’ అంటూ బూతులు తిట్టినట్టు ఆమె పేర్కొన్నది. డీజీపీ, వరంగల్ సీపీ, ఇంతేజార్గంజ్ పోలీసులను కలిసినా న్యాయం జరగలేదని వాపోయిం ది. ప్రభుత్వం స్పందించి తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది.