Singareni | హైదరాబాద్, డిసెంబర్ 3(నమస్తే తెలంగాణ): సింగరేణిలోని అధికారులు, సిబ్బంది అంతా క్రమశిక్షణ పాటించాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎండీ ఎన్ బల రాం హెచ్చరించారు. బొగ్గు ఉత్పత్తిపై మంగళవారం అన్ని ఏరియాల జీఎంలతో సీఎండీ సమీక్షించారు. ఉద యం 7గంటలకల్లా గనుల వద్దకు చేరుకోవాలని, 8 గంటల పాటు విధి గా పనిచేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
కంపెనీ యంత్రా ల పనితీరును మెరుగుపరచాలని, కనీసం 18 గంటలు వినియోగించాలని సూచించారు. పెరుగుతున్న వి ద్యుత్తు డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొ ని థర్మల్ విద్యుత్తు కేంద్రాలకు బొగ్గు సరఫరా చేసేందుకు వీలుగా ఉత్పత్తిని పెంచాలని అధికారులను ఆదేశించా రు. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 120 రోజుల్లో ఉత్పత్తి లక్ష్యసాధనకు సమష్టిగా కృషిచేయాలని సూచించా రు. కొత్తగూడెం వీకే ఓసీ, ఇల్లందులోని రొంపేడు ఓసీల్లో వచ్చే మూడు నెలల్లో ఉత్పత్తిని ప్రారంభించాలని ఆదేశించారు. ఒడిశా నైనీ కోల్‌బ్లాక్‌లో చెట్లగణన కొంతమేర పూర్తయ్యినందున బొగ్గు ఉత్పత్తికి చర్యలు తీసుకోవాలని సూచించారు.