హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ) : ఈ నెల 24, 25 తేదీల్లో న్యూఢిల్లీలో ఆలిండియా స్పీకర్స్ కాన్ఫరెన్స్ జరుగనున్నది. ఈ కాన్ఫరెన్స్‌కు తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌తోపాటు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్‌ముదిరాజ్ హాజరు కానున్నారు. ఈ మేరకు శనివారం వారు ఢిల్లీకి బయల్దేరారు.
1925లో భారతదేశ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికైన మొదటి భారతీయుడు విఠల్‌బాయి పటేల్ బాధ్యతలు స్వీకరించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ కాన్ఫరెన్స్‌కు మండలి చైర్మన్ గుత్తా సుఖేంధర్‌రెడ్డి వెళ్లాల్సి ఉన్నప్పటికీ ఆయనకు శస్త్ర చికిత్స జరిగినందువల్ల హాజరుకావట్లేదని సమాచారం.