హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలో ఆల్ఫ్రాజోలం మత్తు పదార్థం తయారీ కేంద్రంపై పోలీసులు దాడు లు జరిపారు. రూ. కోటి విలువైన 2.6 కిలోల ఆల్ఫ్రాజోలం, ముడిపదార్థాలు, యంత్రాలను సీజ్ చేశారు. గుమ్మడిదల ఠాణా పరిధిలోని కొత్తపల్లి శివారులో నిషేధిత ఆల్ఫ్రాజోలంను తయారు చేస్తున్నట్టు సమాచారం అందిందని నార్కోటిక్ బ్యూరో డీజీ సందీప్ శాండిల్య చె ప్పారు. స్థానిక పోలీసులతో కలిసి దాడులు చేపట్టి కోటి విలువైన ఆల్ఫ్రాజోలంను సీజ్ చేశామని వెల్లడించారు. ఈ మత్తు పదార్థాన్ని ఎక్కువగా కల్తీ కల్లులో ఉపయోగిస్తుంటారని తెలిపా రు. గోసుకొండ అంజిరెడ్డి, క్యాసారం రాకేశ్‌ను అరెస్టు చేశామని, మరో నిందితుడు ప్రభాకర్ గౌడ్ పరారీలో ఉన్నాడని డీజీ పేర్కొన్నారు.