కరీంనగర్ కమాన్‌చౌరస్తా, జూన్ 4: నీట్-24 ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ఉత్తమ ర్యాంకులు సాధించినట్టు విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వావిలాలపల్లి అల్ఫోర్స్ విద్యాసంస్థల కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. అల్ఫోర్స్ ఐఐటీ, నీట్ అకాడమీ విద్యార్థులు జాతీయ స్థాయి పరీక్షల్లో ప్రతిభ చూపడం తమకు గర్వంగా ఉందని చెప్పారు.
జాతీయ స్థాయిలో ఎన్ హేమంత్ 720 మార్కులకు 691 మార్కులు సాధించాడని పేర్కొన్నారు. వీ హాసిని 671, పూజిత 650, ఎన్ కౌశిక్‌రెడ్డి 647, పీ అక్షరరెడ్డి 639 మార్కులు సాధించడం సంతోషంగా ఉందని తెలిపారు. మరో 87 మంది విద్యార్థులు 450కిపైగా మార్కులు సాధించి అల్ఫోర్స్‌లో నూతన శకానికి నాంది పలికారని చెప్పారు. ఈ విజయానికి కారణమైన అధ్యాపకులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు.