హైదరాబాద్, జూన్ 5(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్‌లోని ఇతర నేతల్లాగే తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవి కూడా కాంట్రాక్టు బిల్లుల్లో 10 శాతం కమీషన్ తీసుకుని పనులు చేస్తున్నారంటూ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షినటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌కు అలంపూర్ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదుచేశారు. ఇటీవల గద్వాల జిల్లాలో జరిగిన రాష్ర్టావతరణ దినోత్సవంలో పాల్గొన్న మల్లు రవి బీఆర్ఎస్ నేతల ను వెంటపెట్టుకుని తన వాహనంలో తిప్పు తూ కాంగ్రెస్ నాయకుల ఇండ్లకు తీసుకెళ్లి సన్మానాలు, సత్కారాలు చేయిస్తూ, సొంతపార్టీ కార్యకర్తలను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ అధిష్ఠానానికి లేఖ రాశారు. వివిధ కమిటీలకు చెందిన తాజా, మాజీ అధ్యక్షులు, పార్టీ నేతలు మొత్తం 17 మంది దానిపై సంతకాలు చేశారు.
మల్లు రవి ఏడాది కాలంగా కార్యకర్తలను పట్టించుకోవడం లేదని, కానీ కాంట్రాక్టర్లపై మాత్రం ప్రేమ ఒలకబోస్తున్నారని, 10% కమీషన్‌తో కాంట్రాక్టర్లకు బిల్లులు ఇప్పించారని నేతలు ఆ లేఖలో ఫిర్యాదు చేశారు. అలంపూర్‌లో మల్లమ్మకుంట రిజర్వాయర్‌కు బదులుగా అమలుకు సాధ్యం కాని చిన్నోనికుంట రిజర్వాయర్ కడతామని చెప్తూ తప్పు డు సంకేతాలు పంపుతూ రైతులను భయపెడుతున్నారని ఆరోపించారు. మల్లు రవితో పాటు జడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత, డీసీసీబీ చైర్మన్ విష్ణువర్దన్‌రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ లోకి ఇటీవలే వచ్చిన నియోజకవర్గానికి చెంది న నిరంజన్‌రెడ్డిని క్రమశిక్షణ కమిటీలోకి తీసుకున్నారని అచ్చంపేట కాంగ్రెస్ నేతలు ఫిర్యా దు చేసినట్టు తెలిసింది. దీంతో మల్లు రవిపై మీనాక్షి ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది.
హైదరాబాద్, జూన్ 5 (నమస్తేతెలంగాణ): కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్, నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవిపై అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సం పత్కుమార్, ఇతర నేతలు ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షినటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన మహేశ్‌కుమార్‌గౌడ్ మల్లు రవిపై విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు.